పడవేసుకొచ్చాయి పక్షులన్నీ
పదిలంగా మీరంతా రారండి
పక్షుల పడవను చూడండి
పడవలో సేదతీరి ఉన్నాయి
ఏడేడు సముద్రాలు దాటుతూ
ఎక్కడెక్కడో అవి తిరుగుతూ
కృష్ణా నది తీరము చేరాయి
అమరగిరి అందాలు చూపాయి
అటు వచ్చిన పర్యాటకులకు
కనులవిందు చేస్తూ కనిపించాయి
చుట్టూరా పచ్చ పచ్చని గుట్టలతో
నట్ట నడుమ ఆ అందాల తీరం
ఉదయం వేళ పొగ మంచు
మరింతగా అందం పెంచింది
ఆ నదిలో చేసే బోటు విహారం
అద్భుత అనుభూతి నందిస్తుంది
ఈ ఆహ్లాదకర వాతావరణం
పర్యాటకులకే కాదండోయ్
పక్షులు కూడా ఆస్వాదిస్తున్నాయి
అపురూప దృశ్యం అందరు వీక్షించండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి