పచ్చని చెట్లు
రంగురంగుల పూలు
నీలాకాశం
తెల్లని మేఘాలు
మెరిసే నక్షత్రాలు
విశాల సముద్రాలు
వీటిని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి.!!
అందమైన అమ్మాయిలు
అరవై నాలుగు కళలు
మెరిసే కళ్ళు
కనే కలలు
విరిసే ఊహలు
ఎగిరే పక్షులు
పారే నదులు
వీటిని ఆనందంగా అభినందించాలి.!!
అందమైన బంధాలు
అమ్మానాన్న
అక్క చెల్లి
అన్నా తమ్ముడు
స్నేహితులు బంధువులు
విశ్వ మానవులు
దేవుళ్ళు పిల్లలు
వీళ్లను మనస్ఫూర్తిగా ప్రశంసించాలి!
వీళ్లను ఆనందంగా అభినందించాలి!!
ప్రశంసా ఒక ప్రకటన కాదు
ప్రశంస ప్రకృతికి ఒక కృతజ్ఞత!!
అభినందన దీవెన కాదు
అభినందన ఒక అద్భుతమైన ఆనందం!!
ప్రశంసలు అభినందనలు కొనకూడదు
పొందాలి!!
అవి సహజంగా ఆవిష్కరించబడాలి!!!.
ఈ సంవత్సరానికి వీడ్కోలు
కొత్త సంవత్సరానికి ఆహ్వానం.
డా.ప్రతాప్ కౌటిళ్యా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి