మేలుకొలుపులు - డాక్టర్ అడిగొప్పుల సదయ్య
 03.
మీనమై దిగి సోమకున్నట మీరమందున జంపియున్ 
శాన వేదములన్ని తెచ్చియు స్రష్టకిస్తివి,పేర్మితో;
మానికంబగు కూర్మమై యురు మందరంబును మోస్తివే!
మీన కేతన జన్మదా! యిక,మేలుకో! ధర నేలుకో!!
మీరము= సముద్రం 
శాన = గొప్ప
స్రష్ట= బ్రహ్మ 
మానికం= శ్రేష్ఠమైన 
ఉరు= భారీ 
మందరం=మందరమను పర్వతం 
మీనకేతనుడు= మన్మధుడు 
మీనకేతన జన్మదుడు= విష్ణువు
04.
నేలపై ప్రతి రేణువందున నీవె యుంటివి మాధవా!
గాలిలో ప్రతి వాయువందున గంధమీవెగ రాఘవా!
లాల యందున, జ్వాల యందున లావు నీవెగ కేశవా!
మేలయై యిట చేరినిల్తిమి, మేలుకో! ధరనేలుకో!!
====================


గంధము= వాసన
లాల=నీరు
లావు=బలము
మేల=కలయిక(గుంపు)
=========================
-డాక్టర్ అడిగొప్పుల సదయ్య 
వ్యవస్థాపక అధ్యక్షుడు 
మహతీ సాహితీ కవిసంగమం 
కరీంనగరం 
9963991125
కామెంట్‌లు