చేతులు చాచి నిలిచి
చెంత చేరిన వారికి
సాంత్వన నిచ్చే తరువు
తల్లి కాక పోతే ఇంకెవరు?
ఎర్రటి ఎండలో నడిచే
పచ్చటి శాఖలతోటి
చల్లటి నీడనిచ్చి సేదతీర్చు
చెట్టు మిత్రుడు కాక మరెవరు?
ఆకలి గొన్న జీవులకు
అమృత ఫలాలనిచ్చి
అన్నమై కడుపు నింపు
అమ్మ కాదా మరి మాను?
ఎన్నో పక్షులకు నీడనిచ్చి
ఎండ వానల నుండీ
ఎపుడూ కాపాడే
వృక్షము తండ్రి కాదా?
ఆకులు పువ్వులు బెరడు
ఆఖరికి వేర్లు కూడా ఇచ్చి
అనారోగ్యము బాపి
ఆయువు పెంచే వైద్యుడెవరు?
చక్కని ఇంటికి రక్షణగా
మక్కువగా బిగించుకోను
చెక్క తలుపుల కోసం
ముక్కలుగా కొమ్మలిచ్చే నేస్తమెవరు?
చెట్లు పెంచి అంతటా
ధరణి తాపము తగ్గించి
రెట్లుగా లాభము పొందే
గట్టి నిర్ణయము మేలు కాదా?
వృక్షో రక్షతి రక్షితమంటూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి