అనగనగా ఒక ఊరిలో చాలా ఏళ్లగా ఒక పిశాచి తిరుగుతూ ఉండేది, ఆ పిశాచి రాత్రి కాగానే ఊరిలోకి వచ్చేది, పిశాచి చేతులు వంకరగా ఉంటాయి, అది ఊరిలోకి రానే వచ్చింది అది రక్తం తాగే దయ్యం దానికి కల్లు ,సారా నైవేద్యంగా పెట్టాలి, దానికి పెట్టకుండా సారా తాగితే, పిశాచి వాళ్ళ రక్తం తాగేది, దానికి ఊరి చివర తాటి చెట్ల మధ్యన చెట్లకు కల్లు,సార, తాగిన వారిని అది చెట్లకు వేలాడదీసేది,ఆ మనుషులు వింతగా మాట్లాడుతారు దాని అర్థం, అమావాస్య వస్తుంది మమ్మల్ని కాపాడండి, ఆడవారు మిట్ట మధ్యాహ్నం దానికి నైవేద్యంగా పెడతారు, అది రాత్రి పూట ఆ నైవేద్యం లాగా పెట్టిన కల్లు ,సారా తాగుతుంది రోజు ఆడవారు నైవేద్యంగా పెట్టాలి, పెట్టకపోతే అది వారి భర్తల రక్తం తాగుతుంది, అందుకు ఆడవారు కల్లు ,సారా పెడతారు. పూర్వము ఒక అమ్మాయి కల్లు,సారా దుకాణాన్ని నడిపేది, అమ్మాయి భర్త రోజు సారా తాగి చనిపోయాడు, భర్త చనిపోయాడు అని చాలా బాధపడింది, ఊరు జనాలు ఆమె కల్లు ,సారా అమ్ముతుందని దుకాణాన్ని తగలబెట్టారు, దుకాణంతో పాటు ఆమె కూడా తగలబడిపోయింది, కొన్ని నెలల తర్వాత ఆమె ఆత్మ ఊరిలోకి వచ్చింది, ఒకరోజు ఊరిపక్క ఉన్న ఊరిలో ఒక ముసలి ఆవిడ కొడుకు ఊరి నుండి వచ్చాడు, దయ్యానికి నైవేద్యంగా పెట్టకుండా సారా తాగాడు, అది తెలుసుకున్న పిశాచి వాడి గొంతు కోసి ,రక్తం తాగుతుంది అది చంపేసింది చూడలేక మంత్రగత్త ఆ పిశాచిని చంపేయాలనుకుంది, ముసలి అవ్వ చాలా రోజులు, కొండమీద పూజలు చేసి ఊరిలోకి అడుగు పెట్టింది, నడుచుకుంటూ వచ్చింది ఒకరోజు ముసలి అవ్వ దాని వస్తువు తేవాలని చెప్పింది కొన్ని రోజుల తరువాత ఒక తాగుబోతు ఊరిలోకి వచ్చాడు అది పిశాచి చుట్టు పట్టుకొని నన్నే కొడుతావే అనుకుంటూ దాన్ని జుట్టు గుంజుకుంటూ వచ్చాడు, ముసలి అవ్వ దాన్ని జుట్టు తెంపురా అని గట్టిగా కేక వేసింది, ఆ మాట విని తాగుబోతు తెంపాడు, అది మంటల్లో భగ్నం అయింది, ఆ దయ్యం ఊరి విడిచిపెట్టి వెళ్లిపోయింది, ఊరి ప్రజలు చాలా సంతోషించారు, ఊరికి పట్టిన పీడ వదిలిపోయిందని, ఆ తాగుబోతుని ఎత్తుకొని ఊరేగించారు, అందరు సంతోషంగా ఉన్నారు.
పిచ్చి దయ్యం;- చరిష్మా-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి