గలగల పారే సెలయేర్లు, కిలకిల నవ్వులు, పూచే పువ్వుల పరిమళాలు, సూర్యుని తొలి కిరణాలు, వెన్నెల కలువలు, చిరుజల్లులు చిన్నారులు. నేటి బాలలు రేపటి పౌరులు అట్టి భావితరాలు కన్న తల్లిదండ్రులకు పుట్టిన భూతల్లికి, దేశమాతకు ప్రాణాలు, అట్టి బాలల కోసం నిరంతరం తరంతతరం ఆలోచించే బాల సాహిత్య సృష్టికర్త శ్రీ గుర్రాల లక్ష్మారెడ్డి గారు వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా తన పాఠాన్నే పాటగా తన లక్ష్యాన్ని కథలుగా మలచి ఉత్తమో త్తమ గురువుగా నిరంతరం బాలల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిన మహనీయులు.
సాహిత్యంలో కథా సాహిత్యానికి, శిల్పానికి ప్రత్యేక స్థానం ఉంది. ఊహాత్మక ఉత్తేజకరమైన సన్నివేశాల కలయికే కథ అనుకుంటే, మనిషి జీవితానికి ప్రయోజనం కల్పించడమే కథల పరమార్థం. చిన్న చిన్న కథల సృష్టికర్తగా కవివర్యులు శ్రీ గుర్రాల లక్ష్మారెడ్డి గారి ప్రతి కథ ఉపయుక్తమై చిన్నారి మొగ్గ కోసం వార్తాపత్రికలో, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, బాలచెలిమిల్లాంటి ఎన్నో దినపత్రికలలో వారి కథలు ప్రచురితమై యువ కథా రచయితలకు మార్గదర్శకమైయాయి. కలం గీసిన చిత్రాల వెన్నెల కలువలు బాల కథా సంపుటి నిజంగా అద్భుతమైన 29 కథల సంపుటి. హిమావత్ శిఖరానికి రంగు వేయడం అంటే ఎంతటి సాహసమో, వయసులో సాహిత్యంలో , కథా పటిమలో మాకు గురుతుల్యులైన శ్రీ గుర్రాల లక్ష్మారెడ్డి కవి వర్యులకు ముందుమాట రాయడం అంతే, వారు మా మెట్టింటి ఊరు కల్వకుర్తి వాస్తవ్యులు. మంచి మనసున్న గౌరవనీయులు. నాటి పౌరాణిక, సాంస్కృతిక పురాణ పాత్రల రీతిలో కథా చిత్రణ చేయడంతో పాటు నేటి సామాజిక చిత్రణతో పిల్లల జీవితాలను ధన్యం చేసే గౌరవనీయులు శ్రీ గుర్రాల లక్ష్మారెడ్డి గారి సృష్టి చిత్రణకు అక్షరాభివందనం. ఇంకెన్నో కథల సృజనతో సృజనాత్మక భవితవ్యాన్ని తీర్చే వారి కలానికి, వారికి, వారి కుటుంబానికి వాగ్దేవి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా వేడుకుంటూ-----
సాహితి విధేయురాలు
డాక్టర్ బండారు సుజాత దేవి. హైదరాబాద్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి