మౌనానికి ముగింపులా
ధ్యానంలో అనుభూతిలా
గమనంలో గమ్యంలా
పయనంలొ ప్రచోదనంలా
నిర్ణయమేదో తీసుకునేలా
విజయమేదో దొరికేసేలా
విలువలన్నీ మారేలా
కలలన్ని కనుల ముందు...
రారమ్మని పిలుస్తున్నట్టూ
సందేహం వద్దన్నట్టూ
సఫలత చెందావంటూ
స్వాగతాలు నీకంటూ...
అన్వేషణ అంతమై
అమృత క్షణాలేవో
ఆనందం నింపుకుని
అరచేత వాలినట్టూ...
వడి పెరిగిన అడుగులన్నీ
వెన్నెల మడుగులైనట్టూ..
జడిగా కురిసిన హిమమంతా
వెన్నలా కరుగుతున్నట్టూ..
కనుచూపుకు అందేలా
పెను వెలుగుల పంటేదో
మును ముందే వచ్చి నిలిచి
వినువీధికి మనసెగిరేలా
వేడుక తెచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి