చేతుల చేవ కోలాటం బతుకున స్వర్గమే ఊరు
చేతికొచ్చే పంట మూతి చేర్చే చెమట కష్టం పల్లెదే
ఉచితం గిఫ్ట్ శ్రమగీత బెస్ట్ సేదదీరే చెట్టే ఊరు దా!
పరుగులేదు ఆత్రపడదు ధైర్యం దయ ఓపిక ఊరే
నడిచే బండి ఇల్లుచేరే తిన్నగా నడిపేదే పల్లెబాట
దూరమైన బాధ కళ్ళల్లో సూటిగా పేటే పల్లెకాదే
మంచికిపోతే మరేదో రాదు పల్లె పిడికిలి నిప్పే
కొప్పు మాట పూలతోట గిలకనీరు చూడ ఊరు
నడిచేబాట తిరిగే తోట ఊరు ప్రశాంత కోట నిద్ర
గుడి దేవుడు బడి జీవుడు ప్రేమే ఊరు కొలువు
కష్టం కన్నీరు అన్నీ ఓకే బతుకున లేందే ఊరు లక్
మధుశాలకాదు తాజా ఫలాల మత్తు పల్లె సొత్తదే
సొంగచుట్టలో పంగకాళ్ళెగిరే తోఫా మంచు వాన
కొంకుర్లు తిరిగే చలిచెక్కిలి పరార్ పల్లెఎద ఫైర్
గాలాలుండవ్ గోళాలే దూపకు చొప్పగడ్డి పల్లెనీడ
అమ్మనీడ ఆవుపాలు బలం పాపకు ఊరే పరుగు
నలుగురి మాటే గొప్ప! పేక పడుగు నేత పల్లెసీమ
సాహసమే ఆకాశం దాటే టెక్నిక్ మనసేలేని ఊరు
ఒక్కసారి వచ్చిచూడు ప్రియతమా ఊరే ప్రకృతి
వీడిన మనిషి ప్రదక్షిణ ఊరు చుట్టూతా ఎప్పుడూ
దూరాన ఆకుపచ్చ ఊపిరి దరిజేరలేని కళేఊరు
================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి