అనగనగా ఒక ఊరిలో సర్కారు బడి ఉండేది ఆ బడిలో 100 మంది పిల్లలు ఉండేవారు ఆ బడిలో చాలామంది పిల్లలకు చదవడం రాయడం వస్తుంది కానీ ఒకరోజు పదిమంది పిల్లలని వారి తల్లిదండ్రులు ఈ పాఠశాల నుండి తీసి ప్రైవేట్ పాఠశాలలో చేర్చారు ఆ పాఠశాలలో చేరిన కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు చదువులో వెనకబడ్డారు ఎందుకంటే సర్కార్ బడిలో పిల్లలకు డిజిటల్ బోర్డు టీవీలను ఉపయోగించి పాఠాలు చెప్పడం వలన వారికి సులభంగా అర్థం అయ్యేవి కానీ ప్రైవేటు బడిలో ఈ విధమైన బోర్డులు లేవు కానీ ప్రభుత్వ పాఠశాలలలో బోధనతో పాటు విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్ తో పాటు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందిస్తారు పైసలు కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ రకమైన సదుపాయాలు ప్రైవేటు పాఠశాలలో ఉండవు ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వ బడి నుంచి ప్రైవేటు బడిలో చేరిన పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు కొన్ని రోజుల తర్వాత మరికొంతమంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలను వీడి సర్కారు బడిలో చేరారు దీనితో సర్కారు బడి విద్యార్థుల సంఖ్య 200 కు చేరింది
నీతి సర్కారు బడులను కాపాడుదాం మెరుగైన విద్యను పొందుదాం
నీతి సర్కారు బడులను కాపాడుదాం మెరుగైన విద్యను పొందుదాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి