వెలుగు నిజం ..: - ప్రమోద్ ఆవంచ - 7013272452
ఉదయం చలి వణుకుల రాగం 
మధ్యాహ్నం భానుడి సురుకుల గాయం 
సాయంత్రం వెన్నెల మంచు స్నానం 
ప్రకృతి ఒడిలో నిత్యం మనిషి చేసే 
వ్యాయామం 
                      2
గుట్టుచప్పుడుగా కాపురం చేసే పచ్చని 
అడవి 
సున్నితపు లేతాకుల్లో నుంచి 
విచ్చుకుందో ఆకాశం 
కళ్ళల్లో బెరుకుదనం బుగ్గల్లో ఎరుపుదనం 
పెదవుల్లో చిలిపితనం నడతలో 
అమాయకత్వం 
మొత్తంగా అడవి మయూర నాట్యం 
                     3
ముడుచుకున్న మస్తిష్కంలో 
తెరుచుకుందో కల 
ఎక్కడెక్కడో విహరిస్తుంది 
అడవిని సైతం స్వంతం 
చేసుకుంది 
తనని కాదన్న కాలాన్ని కూడా ఒడిసి
పట్టుకుంది
క్రూర మృగాలు తోకూపుకుంటూ
వెంట తిరుగుతున్నాయి 
అకస్మాత్తుగా మనుషులందరూ 
మంచివారిగా మారిపోయారు 
జీవితంలో కొత్త రంగులను పరిచయం
చేస్తుంది 
ఇదివరకెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని 
కళ్ళ ముందు నిలబెడుతుంది
                      4
కాలిపోతున్న అడివి ఇప్పుడంతా పచ్చగా 
కనిపిస్తుంది 
కాలిపోయిన వాసన పరిమళమై 
ఎవరికి వారికే పరిమితమైంది 
కళ్ళ నిండా కల పచ్చకామెర్లై 
కమ్ముకుంది 
కల గాలికి ఆవిరౌపోయ్యేకొద్దీ 
మనసుకున్న ముసుగు కొద్ది కొద్దిగా 
తొలిగిపోతుంది
                      5
మబ్బుల్లో ఈదుతూ బయటకు వచ్చిన 
భానుడు మెల్లగా కొత్త వెలుగు నిజాలను 
వీక్షిస్తున్నాడు 
కల కాలిపోయి నిజం బట్టబయలైంది..
                        

కామెంట్‌లు