ఆవేదనే నివేదన. :- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
7.
అదేమిటో రోజు ఒకేలా,
 సాగినా తగని విసుగు! 

ఏరోజుకారోజు మారినా, మనసు పడదు పొసగు!

హోమో జీనియస్ లైఫంటే, చప్పన ,మనసు అలుగు!

హెటిరో జీనియస్ వే ,
ఉరికే ఉద్వేగాల పరుగు!

ఏమిటో ఈ వ్యధ ,
వింతకథ వినరా సింహాచలేశా!

8.
నడిచి రాలేని శబరి ,
ఎదురేగి మోక్షమిచ్చావు! 

రాయై కదలని అహల్య, శాపవిమోచన చేశావు! 

అశోకవనం సీతను,
 శోకం బాపి అనుగ్రహించావు!

పరసతిమోహం రావణ, అహంకారం హతమార్చావు!

విభీషణ పట్టాభిషేకం, 
రామరూపా, సింహాచలేశా!

9.
కరకు కంస వధ చేసి,
దుష్టశిక్షణ  చూపినావు!

అమ్మానాన్నల చెరసాల, క్లేశాన్ని తొలగించినావు! 

తాత ఉగ్రసేనుడ్ని,
 తిరిగి రాజుగా నిలిపినావు! 

గోపికల హృదయాలు,
 నీ రాగవశం చేసుకున్నావు! 

నాటి రాధా మాధవుడు,
 నీవే కదరా, సింహాచలేశా!
_________


కామెంట్‌లు