16.
నేను అందరికీ అనవసరమే, నా గోడు విడ్ఢూరమే!
నా ఉనికి మురికి, నా కాళ్ళు, అందరికీ అసహ్యమే!
నా ప్రసక్తి ఆసక్తి ఉంటే ,
అదొక గొప్ప సంబరమే!
ఊహానైనా ,ఎవరైనా,
నా ఊసెత్త,అది నిషేధమే!
మరి నాకు గతి ఎవ్వరు?
నీవేగా, మా సింహాచలేశా!
17.
ద్వాపర యుగం గీతాచార్య, పార్థుడికిచ్చే అభయమే!
ఎప్పుడు ధరణి ధర్మగ్లానో,
ఆధర్మవృద్ది తీవ్రమే!
యుగమేదయినా, అవతారము,ధరణి సహజమే!
కలియుగం ధర్మగ్లాని , అధర్మవృద్ది సమ్మేళనమే!
ఈ దీనుని మొర వినవా, కనవా, మా సింహాచలేశా!
18.
సర్వత్రా జనాన ధర్మాచరణ,
చూడ బలహీనమే!
జగమంతా జన ధన నిజ, సంపాదనే ప్రధానమే!
అగ్నికి వాయువు తోడులా, కామదృష్టి బలోపేతమే!
మోక్షమన్నది అప్రస్తుతమే, అర్ధకామాల రాజ్యమే!
ధర్మ ,మోక్ష దృష్టి కరుణించు, మది. మా సింహాచలేశా!
________
ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి