ఆటవెలది పద్యసుమాలు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ -9640748497
అద్దమంటిమాట ఆచితూచీవాడు
మనసు గాయపరచు మాటవలదు
మాటమంత్రసమము మాన్యులుయెరుగర
వినుము సోదరుండ వీరభద్ర

వాక్కు కున్న పదును వాడికత్తికిలేదు
మార్చగలదుమాట మనిషి మనసు
జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త
శబ్దములకు గొప్ప శక్తి గలదు


కామెంట్‌లు