సుప్రభాత కవిత : -బృంద
రేపటి కొత్త వెలుగుకై
చీకటి తెర తీసిన తూరుపు 
ముగిసిన ఎదురుచూపు 
ముంగిట నిలిచేను.. కలలరూపు!

ఊపిరి ఉయ్యాలలో నిలిచి 
కనుల తలుపులు తెరచి 
కలతలు కరిగే తరుణం కోసం 
కరుణ కురిసే దైవం కోసం... నిరీక్షణ!

ధ్యేయమే ధ్యానంగా 
ధైర్యమే ఆయుధంగా 
నమ్మకమే అపార శక్తిగా 
సాగించిన పోరాటానికే..... విజయం

ఆరాటాల ఆత్రానికి 
దొంగాటలాడే కాలానికి 
మధ్యన జరిగిన యుద్దానికి 
కనుచూపు మేరలో కనిపించె ... ఫలితం

అంతులేని అలజడులకు 
అర్థం కాని అవాంతరాలకు 
అలుపులేని ఆశల అలలకు 
ఆవిరవని ఉత్సాహమే..... బలం

చెరగని చిత్తశుద్ధి  నీడగా 
తరగని విశ్వాసమే జోడుగా 
సడలని పట్టుదల  తోడుగా 
సాగే పయనపు గమ్యమే... జీవితం

కరుణ కుమ్మరించే కమ్మని వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు