లోకం :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కుక్కలా మొరుగుతుంది
భయపడకు
కాకిలా గోలచేస్తుంది
పట్టించుకోకు

పాములా బుసకొడుతుంది
అధైర్యపడకు
గాడిదలా తన్నుతుంది
చెంతకుపోకు

గోడమీదపిల్లిలా కూర్చుంటుంది
గమనించు
పిల్లులమధ్యలాకోతిలా పంచుతానంటది
పంచాయతీకిపోకు

అవహేళన చేస్తుంది
లెక్కచేయకు
ఆందోళన చేస్తుంది
అడ్డంతగులు

నిప్పులు క్రక్కుతుంది
ఒళ్ళుకాల్చుకోకు
రాళ్ళు విసురుంది
గాయాలబారినపడకు

నిందలు వేస్తుంది
దీటుగాజవాబివ్వు
విషం చిమ్ముతుంది
తెలుసుకొనినడువు

కళ్ళల్లో కారంచల్లుతుంది
కాచుకోవటంనేరువు
చెవుల్లో సీసంపోస్తుంది
దరిదాపులకుపోబోకు

పక్కతోవ పట్టిస్తుంది
జాగ్రత్తవహించు
ముందుకు పోవద్దంటుంది
నిజాన్నిగ్రహించినడువు

పెద్దగా ఉరుముతుంది
చెవులుమూసుకో
తళుక్కున మెరుస్తుంది
కళ్ళుకాపాడుకో

చెవిలో పూలుపెడుతుంది
నిజమెరుగు
బట్టలపై బురదచల్లుతుంది
దగ్గరకుపోకు

లోకంనోర్లను
కుట్టేయటంకష్టమని తెలుసుకో
నీచెవులను
మూసుకోవటం సులభమని ఎరుగిమసలుకో


కామెంట్‌లు