*పొగరుబోతు పాపిరెడ్డి* : - అన్నారం కుసుమాంజలి-7వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల-జిల్లా సిద్దిపేట.-9704865816
 అనగనగా ఒక ఊరిలో పాపిరెడ్డి అనే రాజు ఉండేవాడు.అతనికి గర్వం ఎక్కువ.పొగరుగా ఉండేవాడు.రాజు వాళ్ళ తండ్రి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాడు.రాజ్యం మాత్రం కొడుకుకు అప్పచెప్పాడు.పాపిరెడ్డి
ఊరిలో అందరినీ బెదిరించుకుంటూ జీవనం గడిపేవాడు.ఊరిలో పాపిరెడ్డి మాట ఎవరు వినడం లేదు.
ఒకరోజు పక్కూరికి పయనమై పోతాడు.
బాగా ఆకలి వేస్తుంది.
జేబులో డబ్బులు లేవు.
అక్కడ సత్తయ్య చికెన్ బిర్యాని హోటల్ చూశాడు.
నా వద్ద డబ్బులు లేవే అని
మనసులో అనుకున్నాడు.
తను మనసు చెప్తుందికదా! నువ్వైతే వెళ్లి భోంచెయ్ తర్వాత సంగతి ఆలోచించు అని అంటుంది.
అప్పుడు  హోటల్ లోకి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తాడు.
పొట్ట పలుగ తింటాడు.
అప్పుడు డబ్బులు కట్టుమని సత్తయ్య అడుగుతాడు.
ఏరా! నీకెంత ధైర్యం రా! నువ్వే నన్ను డబ్బు అడుగుతావా! నీకు ఈ "చికెన్ బిర్యానీ హోటల్" పెట్టుకోవడానికి పర్మిషన్ ఉందా!ఇప్పుడే నీ హోటల్ ను మూసి వేయిస్తాను అని బెదిరిస్తాడు.లైసెన్స్ లేక నడుపుకుంటున్న సత్తయ్య నా హోటల్ తీసేయకండి.తిన్న డబ్బులు ఇవ్వకపోయినా
పరవాలేదని వేడుకుంటాడు.
అలా రా! దారికి అంటూ పాపి రెడ్డి  అక్కడినుండి వెళ్లిపోతాడు.



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice story...
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం