ఆకాశంలో పొద్దుపొడుపు ఎర్రబడిన దిక్కు తూరుపు
కొలనులో కమలాలు కనువిప్పు
సూర్యోదయమని తెలుపు
దినచర్యకు త్వరపడమని తట్టి మేల్కొలుపు
అలసత్వంతో అరమోడ్పు అరతెరుపు తప్పనిసరియై అరచేతుల కన్నుల నలుపు
అరుణ కిరణుని నిబద్ధత అచ్చెరువు గొల్పు
ద్వాదశమాసాలకు పన్నెండు నామాలతో లోకుల పిలుపు
ద్వాదశ గంటల విధినిర్వహణలో
ఎరుగడు ఏమాత్రం అలుపు
ఏడాది పొడుగుతా పనికి ఉండదు
ఆటవిడుపు
నవగ్రహనాయకుడు తేజస్సుతో మిరుమిట్లు గొల్పు
గ్రీష్మాన నదీ సాగర జలాల గ్రహించి తెలివినొడుపు
మరుఋతువున వర్షరూపాన భువికిచ్చి ముదముగొల్పు
ఆరోగ్య ప్రదాత పలుస్వస్థతలనిచ్చి మనలోస్వస్థత నిలుపు
పొలాలు పాదపాలపై ప్రసరించి
పచ్చగ నుంచి పెంచి ఆహారప్రదాత తానేయని తెల్పు
కృత్రిమ దీపాలకై ఆత్రపడక వినియోగించుకున్న ధనం పొదుపు
నమస్కారం తప్ప మననుండి ఏమీకోరని దొడ్డ వేల్పు
సంస్కారవంతుడవై ప్రతిదినం నమస్కరించి కృతజ్ఞత తెలుపు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి