మృతప్రాయులైన అగణిత అభాగినులకు అమృత సంజీవని
వంగప్రాంతపు బిడ్డ తెలుగుగడ్డకు
క్షేమ దానిని
పలుజవ్వనులకు కవనానికి పురోగమనానికి ప్రేరణైన విద్యాదాయిని
బాల్యంలోనే తన భావకిరణాల మెరిసిన ఉదయిని
పరభాషయే ఆయుధంగా పరప్రభుతను ఖండించిన వాగ్వాదిని
నవరసముల జీవనమున సమరసముగ చవిచూసిన రసహృదయిని
సవర్ణజాత యైన తాను వర్ణాంతర వరుని గోవిందరాజునలరించిన ప్రణయిని
జనుల మనముల మావికొమ్మపై
దేశభక్తి అనురక్తి అనురాగానకూసిన కోయిల
పలువిధముల పలుపదవుల తొలి తానేనని స్ఫూర్తిపరిమళాల
వనితలకందించిన పూవని
మహిళలకు మహిమాన్వితమామె జన్మదినం
అభినందనలందు పరిణతవ్యక్తిత్వ ప్రదాయిని🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి