అవ్వా  పొట్టేలు (సరదా జానపద కథ):- డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

 ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్దానికి నా అనే వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కతే వండుకుంటా తింటా తిరుగుతా వుండేది. వాళ్ళింటి పక్కనే ఒక చెరువుంది. ఒకరోజు పక్కింటోళ్ళు ఆ చెరువులో చేపలు పడతా వుంటే చూసి ఆ ముసల్ది కూడా చేపలు పట్టుకుందామని ఒక చిన్న వల తీసుకోని పోయింది. పొద్దున్నించీ సాయంత్రం వరకూ వల ఇసుర్తా వుందిగానీ ఒక్క చేప గూడా పల్లేదు.
"ఎప్పుడూ నాలుగో ఐదో పడతా వుండేవి. ఈ రోజేమి ఒక్కటి గూడా పల్లేదు" అనుకుంటా ఆఖరిసారి చూద్దామని వల విసిరింది. లింగులిటుకుమని సరిగ్గా మన చిటికెన వేలుంటాది గదా అంత చిన్న చిన్న చేప ఒకటి పడింది.
ఏదో ఒకటి దొరికింది చాలనుకోని ఆ ముసల్ది దాన్నే తీసుకోని ఇంటి కొచ్చింది. చూసి చూసి అంత చిన్నదానిని కూర చేసుకోని తినబుద్ది కాలేదు. దాంతో “ఎట్లాగూ నాకెవరూ లేరు. ఈ చేపపిల్లనన్నా పెంచుకుందాం" అనుకోని దాన్ని తీస్కోనిపోయి ఒక చెంబులో ఏసింది. రోజూ దానికి మూడుపూటలా బాగా అన్నం, కూరలు, పండ్లు ఎంత తింటే అంత ఏయడం మొదలు పెట్టింది.
అట్లా ఆ చేపపిల్ల రోజూ బాగా తినీతినీ వారం రోజులు తిరిగేసరికి చిటికెన వేలంత వుండేది కాస్తా చెంబంత లావయింది. దాంతో ఆ ముసల్ది దాన్ని తీస్కోనిపోయి ఒక పెద్ద బిందెలో ఏసింది. ముసల్ది మూడుపూటలా బాగా తిండి పెడతా వుంది గదా, దాంతో అది బాగా మెక్కిమెక్కీ మరోవారం తిరిగేసరికి చెంబంత వున్నది కాస్తా బిందెంతయింది. అప్పుడా ముసల్ది దాన్ని తీస్కోనిపోయి జాలాడిలోనున్న పెద్ద గచ్చులో ఏసింది. కానీ వారం తిరిగేసరికల్లా అది బాగా తినీతినీ బిందెంత వున్నది కాస్తా గచ్చంతయింది. దాంతో ఆ ముసల్ది ఇంగ లాభం లేదనుకోని దాన్ని తీస్కోనిపోయి ఇంటి పక్కనే వున్న చెరువులో వదిలింది.
ఆ ముసల్ది యాడ తిరుగుతా వున్నా అన్నం సమయానికి మాత్రం చెరువు కాడికొచ్చి “ష్..ష్..." అని పిల్చేది. అట్లా ఆ ముసల్ది “ష్.. ష్..." అనడం ఆలస్యం ఆ చేప యాడున్నా సరే రయ్యిమని ఈదుకుంటా ఆమె దగ్గరకొచ్చేది. ఆ ముసల్ది తాను తెచ్చినేటివన్నీ దానికి ప్రేమగా ఒకొక్కటే తినిపిస్తా కబుర్లాడేది.
ఒకరోజు ఆ ముసల్దానికి ఏదో పనిబడి పక్కూరికి పోయింది. సాయంకాలానికి గానీ రాలేకపోయింది. ఆరోజు మధ్యాన్నం ఏం జరిగిందంటే కొందరు గొర్రెలోల్లు గొర్రెల్ని తోలుకుంటా ఆ చెరువు కాడికి వచ్చినారు. గొర్రెలు నీళ్ళు తాగినాక వాటిని అదిలిస్తా “ష్...ష్..." అన్నారు. అవ్వే వచ్చిందనుకోని ఆ చేపపిల్ల సంబరంగా బైటికొచ్చింది. దాన్ని చూసి వాళ్ళు "అబ్బ! ఎంత లావుగుందీ చేప. దీన్నెట్లాగైనా పట్టుకుంటే బాగా కూరొండుకోని కడుపు నిండా తినొచ్చు" అనుకోని మట్టసంగా చుట్టూ చుట్టుకోని పట్టేసుకున్నారు. దాన్ని ఇంటికి తీస్కోనిపోయి చంపి పులుసు చేసుకున్నారు.
అవ్వ సాయంత్రం ఇంటికి రాగానే “పాపం! మధ్యాన్నం నించీ ఎంత ఆకలిగా ఉందో ఏమో” అనుకుంటా బెరబెరా ఒక పెద్ద గిన్నె నిండా అన్నం చేసుకోని చెరువు కాడికొచ్చి ఎప్పట్లాగే “ష్... ష్..." అని పిల్చింది. కానీ అది లోపలుంటే గదా వచ్చేది. ఎంత సేపు పిల్చినా రాలేదు.
"ఇదేందిరా బగమంతుడా! రోజూ పిలుస్తానే రయ్యిమని ఎగుర్లాడుకుంటా వచ్చేది. ఈరోజేమి ఎంత పిల్చినా రావడం లేదు. ఏం జరిగిందో ఏమో" అనుకుంటా చుట్టూ చూస్తా వుంటే చెరువు కాడ మేకల, గొర్రెల కాలిగిట్టల గుర్తులు కనబన్నాయి. "కొంపదీసి ఈ మేకలోల్లుగానీ దాన్ని పట్టుకోలేదు గదా" అనుకోని నెత్తిన గొంగళి కప్పుకోని, చేతిలో చిప్ప పట్టుకోని, అడుక్కునే దాని మాదిరి ఆ మేకలోల్ల ఇంటి కాడికి పోయి “అమ్మా! అన్నం తినక నాలుగు రోజులైంది తల్లీ! కొంచం ఏమన్నా వుంటే పెట్టండమ్మా" అంటూ అరిచింది. ఆ మేకలోల్లు ఎవరో అడుక్కుతినేది అనుకోని చేపల పులుసు తెచ్చి ఆమె తట్టలో పోసినారు. దాంతో వాళ్ళే చేప పట్టుకోని తిన్నారని ఆ ముసల్ది గుర్తుపట్టేసింది. వెంటనే వురుక్కుంటా పోయి వూరోల్లందరినీ పిల్చుకోనొచ్చి "నా చేప నాకియ్యండంటా" మేకలోల్లతో పెద్ద గొడవ పెట్టుకోనింది.
చచ్చిపోయినాక ఏదీ తిరిగిరాదు గదా. దాంతో పూరోల్లందరూ “అయిపోయిందేదో అయిపోయింది. అదిగాకుండా వేరేది నీకేది ఇష్టమైతే అది కోరుకో, మేమిప్పిస్తాం" అన్నారు. ఆ ముసల్ది ఏం కోరుకోవాలబ్బా అని ఆలోచిస్తా వుంటే వాళ్ళ దగ్గర ఒక మాంచి పొట్టేలుపిల్ల కనబడింది. దాంతో అది కావాలనింది. సరేనని వూరోళ్ళు ఆ పొట్టేలు పిల్లను ముసల్దానికి ఇప్పించినారు.
అవ్వ ఆ పొట్టేలు పిల్లని చానా ప్రేమగా చూసుకొనేది. మంచి మంచి పండ్లు, కూరగాయలూ తీసుకోనొచ్చి పెట్టేది. అట్లా కొంతకాలానికి అది పెరిగి పెద్దగయింది. అవ్వ రోజూ తన కోసం అడవికి పోయి కష్టపడి అన్నీ తీసుకొస్తా వుంటే చూసి, ఒకరోజు పొట్టేలు "అవ్వా... అవ్వా.... రోజూ నా మేత కోసం ఎందుకంత కష్టపడతావ్. నేనిప్పుడు పెద్దదాన్నయినాను గదా. నేనే పోయి తినొస్తాలే" అనింది. ఆ ముసల్ది 'సరే' అనింది.
ఒకరోజు ఆ పొట్టేలు అడవిలో పోతావుంటే దారిలో దానికి ఇద్దరు దొంగలు ఒక గుహలో నుంచి బైటికి వస్తా కనబన్నారు. వాళ్ళట్లా బైటికి పోవడం ఆలస్యం ఇది మట్టసంగా లోపలికి దూరింది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకోనొచ్చిన వజ్రాలు, రత్నాలు, మణులూ, మాణిక్యాలు, బంగారం, హారాలు... ఒకటిగాదూ రెండూ గాదు... కుప్పలు కుప్పలు కనబన్నాయి. వెంటనే ఆ పొట్టేలు అట్లాఇట్లా ఒకసారి చూసి కనబన్నవి కనబన్నట్లు కుప్పలు కుప్పలు నున్నగా మింగేసి ఇంటికి చేరుకోనింది.
అవన్నీ కడుపులోనికి పోయినాయిగానీ అరగవు గదా. దాంతో ఇంటికి చేరగానే “అవ్వా అవ్వా! కడుపు ఒకటే నొస్తావుంది. కాస్త రోకలిబండ తీసుకోనొచ్చి ఒకొక్క పక్క ఒకొక్క పోటు పొడుచే" అనింది. దాంతో అవ్వ “దారిలో అడ్డమైనవన్నీ తింటే కడుపు నొయ్యక ఏం నొస్తాది" అంటూ కోపంగా రోకలిబండతో ఎడమపక్క ఒక్క పోటు పొడిచింది. అంతే... ఆ పొట్టేలు నోట్లోంచి మణులూ, మాణిక్యాలూ దభీమని కిందపడినాయి. ఆ ముసల్ది ఆచ్చర్యపోతా ఈసారి కుడిపక్కన ఒక పోటు పొడిచింది. ఈసారి వజ్రాలూ, వైఢూర్యాలూ పడినాయి. అట్లా ఒకొక్క పోటుకు ఒకొక్కటి చొప్పున కడుపులో వున్నవన్నీ ఒక్కటి గూడా మిగలకుండా అన్నీ బైటికొచ్చేసినాయి.
ఆ ముసల్ది అవన్నీ చూసి చానా సంబరపడింది. వాటిని అమ్మి పెద్ద మేడ కట్టుకోనింది. అది చూసిన పక్కింటామె "నిన్న మొన్నటి వరకూ మామూలుగానే వుండెనే. ఒక్కసారిగా యాన్నించి వచ్చిందబ్బా ఇంత డబ్బు" అని ఆచ్చర్యపోయి ముసల్దాని దగ్గరికి పోయి “ఏంది కత" అనడిగింది. ఆ ముసల్ది జరిగినదంతా చెప్పింది.
ఆ పక్కింటామె దగ్గర ఒక కుక్కుంది. ఆమె ఇంటికి పోగానే “నువ్వూ వున్నావు ఎందుకు? మూడుపూటలా తిని కూచోడానికి తప్ప ఎందుకూ పనికిరావు. పో... పోయి ఆ పొట్టేలు మాదిరి యాడన్నా ఏమన్నా దొరికితే తిని రాపో" అంటూ దాన్ని తన్ని తరిమేసింది. పాపమా కుక్క అడవిలో ఎంత దూరం పోయినా దానికి ఏమీ కనబల్లేదు. దాంతో ఎముకలూ, చెత్తా, చెదారమూ తిని మట్టసంగా ఇంటికొచ్చింది.
కుక్క ఇంటికి రాగానే ఆమె సంబరంగా చాప పరచి కుక్కను దాని మీద పన్నబెట్టి రోకలిబండతో ఎడమ పక్కన ఒక పోటు పొడిచింది. అది ఎముకలు కక్కింది. “ఇదేందిరా నాయనా" అని కుడిపక్క పొడిస్తే నానా గబ్బూ కక్కింది. దాన్తో ఆమె “ఛీ! దరిద్రం దానా! ఇండ్లంతా కంపు కంపు లేపినావు గదే" అంటూ దాన్ని తన్ని తరిమేసింది.
***********
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం