94.
స్వీయఉద్ధరణే,స్వీయయత్నం,
అవరోధమాపలేదే !
పట్టుదల సమస్యల ,
సాధనలే పయనమాగదే!
ఓటమే నీ ముందే తలవంచి, పక్కకే తొలగాల్సిందే!
విజయభామే ఎదురొచ్చి, వరించి హత్తుకోవాల్సిందే!
ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
95.
ప్రకృతి చెప్పే పాఠాలే మనిషి, నిత్యమూ వినాల్సిందే!
లేచి పడి, పడి లేచే ,
అలల నేర్పు సాగరానిదే!
అలుపెరుగక తేనే, నిత్యాన్వేషణే తేనెటీగదే!
కసిగా నేలకేసి కొట్టినా ,
బంతి పైకే లేస్తున్నదే!
ఆవేదనే నివేదన ఆలకించు,
* మా సింహాచలేశా!
96..
చెట్లన్ని ఋతువుల్లోనూ,
తట్టుకొని నిలబడతాయే!
మనకి ఆక్సిజనిచ్చి,
ప్రాణాలు నిలబెడుతున్నాయే!
గట్లుఅడ్డున్నా నదులువెల్లువై ,
ముందుకే పోతున్నాయే!
తీరజనులు తరింపగ, ,
సాగరాన కలుస్తున్నాయే!
ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
_________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి