ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9442058797.
91.
ఏనాడు సమాజాన, సద్గుణవంతులు లేకుండాలేరే!

వందకౌరవుల కాలం ,
ఐదుగురు పాండవులున్నారే!

రాక్షసుల సైతం బలి, ప్రహ్లాదులు మార్గమే చూపారే!

కలియుగం ఒక్క నాయకుడు ,
చాలే జనం నడుస్తారే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
92.
ధనం లేదనద్దు దాతలే, స్వచ్ఛందంగా ముందుకొస్తారే!

ధనవంతుల కొందరైనా, గుణవంతులై తీరుతారే! 

ధనగుణవంతులు,
 ఆర్తులకు ఆసరా అవుతారే!

వారే చేయూతనివ్వ ,
అర్హులు ఘన భవిత కాంచరే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
93.
సామాన్యులే,
మేముసైతమంటూ ,
చిరు సాయం అందిస్తారే!

బిందువులు కలిస్తే సింధువే,
రూకలు కోట్లు చేస్తారే! 

దారిద్ర్య నివారణే దేహాన, 
స్వేదధార స్రవిస్తారే!

చింతవీడి, ప్రతినపూని,
     సరి లక్ష్యమే సాధిస్తారే!

ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు