ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9451058797
52.
మనుషులంతా ఒక్కటన్నది, జంతుశాస్త్ర విషయమే! 

ఎవరికి వారే యమునా తీరే,
        విశ్వాన విదితమే! 

ఏఇద్దరూఒక్కేలా ఉండరన్నదే, మనోవిజ్ఞానసత్యమే! 

మానవీయ గుణాలే మాయం,
అవగతం స్వీయజ్ఞానమే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
    మా సింహాచలేశా!

52.
కలసి ఉంటే కలదు సుఖమే,
          ఓ పెద్ద అనృతమే!

కలసినప్పుడల్లా కలహమేగా,  
        పునరావృతమే! 

ఆత్మస్తుతి పరనిందలే, సమాజాన నిత్య సత్యమే! 

మనిషిమనిషికి,సయోధ్య,
మిథ్యే,మనజీవితమే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!

54.
పిల్లలు చదువే మైకమై ,
      పెరిగి పెద్దవుతున్నారే!

యువకులు నిర్దేశ ,
లక్ష్యమేదీ సాధించ లేకున్నారే! 

యువతులు ఇల్లు మరచి, బాగా ముందుకు పోతున్నారే! 

పిన్నలు సంపాదనే, 
వృద్ధులురోజులే లెక్కిస్తున్నారే!

ఆవేదనే నివేదన ఆలకించు,
   మా సింహాచలేశా!
_________
.



కామెంట్‌లు