కుంభమేళ ఉత్సవం:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి-సెల్ .9491387977--నాగర్ కర్నూల్ జిల్లా.
కుంభమేళా ఈ కుంభమేళా
మనవిశ్వజనుల కుంభమేళా
జరుగుతున్నట్టి ఈ శుభవేళా
ఆహ్వానం పలకాలి ఈ వేళా !

కుంభమేళా మన కుంభమేళా
ప్రయాగరాజ్ జిల్లా కుంభమేళా
వంద 44 ఏళ్లకు ఒకసారి జరిగే
మహా కుంభమేళా ఈ కుంభమేళా!

కుంభమేళా ఈ కుంభమేళా
గంగా యమునా సరస్వతి
నదుల సంగమం వద్ద సాగే
మహోన్నతమైన కుంభమేళా !

సాధుసంతువులు అఘోరాలు
అందరూ కలిసిమెలిసి వస్తారు
వారు పుణ్య స్నానాలు చేస్తారు
మోక్ష దారులను ఇక చూపిస్తారు !

ఈ కుంభమేళాలో మన జన సందోహం
తీర్చుకుంటారు పుణ్య స్నానాల దాహం
వదిలించుకుంటారు వారి యొక్క అహం
తమ మోక్షంకై చేస్తారు వారు సాహసం !

ఈ మన కుంభమేళా ఉత్సవమందు
భక్తజన సమూహం వేస్తుంది
 చిందుఅందరి కది అవుతుంది ఆనందాల
 విందుపాల్గొన్న అందరికీ ఔతుంది అది పసందు !


కామెంట్‌లు