ఊరు రాజకీయం చేయదుకానీ చేస్తే బలే రంజులే
అక్కా ఆపా చెల్లే సిస్టర్ వరుసచుట్టే చాణక్యంపల్లె
ఇంటిని కాపాడు మంటిఆటే బీదబిక్కీ నమ్మేఊరు
ఎల్లప్పుడు ప్రతీక్షలేక దగ్గరుండేది ఊరాయే కళ్ళు
కసరుతీయడు అసరులేదు పనికి పల్లెజీవిసుతాం
పురుసత్ రికాం బీమారీ ములాఖత్ ఊరువేర్లు సీ
సంకలపాప ఈపుసంచిల ఆడే అమ్మ పని పల్లెదే
గిజగిజ ఉశిల్లు గబగబ ఎగిరే గజగజమనే పల్లేగా
తినేది కొందరి ఖాయిష్ ఊరు పావురంగా ముట్టలే
అలవాటు ఆకలిదీర్చు పొరపాటు బాధే పల్లెపాటు
అబ్బో ఏంగొప్ప ఊరుది అంతా ఎరుకే తీపిబంధం
అన్నెందుకు ఊరును మించిన ప్లేస్ ఉందే చెప్పరా
మూన్నెళ్ళనుంచీ చెపుతున్నా ఐనా ఒడుస్తలేకథ
పల్లె అందమే అనుభవిస్తే రాస్తది కడుపుదేవుకొని
పాదాలు పూనిన ఊరు పదాలు జుర్రినట్టే పూనిక
ఊర్లబుట్టనోళ్ళు ఊరంటే నోరెల్లబెట్టే మరేందో సీ
ఇక్కడ అక్కడ బతికేది పల్లెమనసే నగరిఎదకాదే
తటపటాయించకు సందేహించకు నే ఊరుఉనికి
తలొంచనిదే ఊరునీతి తగువులేక బతుకు పల్లెదే
జిందగీ పతంగి ఊరు తిరిగేది మాంజా దారంనీదే
ఆట సాఫ్ ఆలోచన నేక్ హమ్ మాలిక్ హై గాఁవ్ కే
=====================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి