ప్రేమమధురమే
అది తిరిగి ఏమి ఆశించనప్పుడు
మరీ టీనేజ్ ప్రేమలు ఆకర్షణకు దాసోహాలు
దానిని ప్రేమంటే ఎలా..!?
ఏదో ఫలాపేక్షనాశించే దగ్గరవుతది. అది అందినప్పుడు
అది కనుమరుగుఅవుతది.
ఇక్కడ సిన్సియర్ గా ఎవరు ప్రేమిస్తారో...!?
వారు మౌనమునులు మనోవ్యాధిగ్రస్థులు కాకతప్పదు.
అదీ అబ్బాయైనా...!?
అమ్మాయైనా...!?
ఆకర్షణలతో పుట్టే ప్రేమ తోబుట్టువులు కన్నవాళ్ళు
అందరినీ మరిపించి మరో లోకం చూపిస్తది.
తన దేహవాంఛతీరాక
ఏకాకిని చేసి ముఖంచాటేస్తది.
జాగ్రత్త జాగ్రత్త
హృదయ దౌర్భల్యంతో...
మాయా ప్రేమలో పడకండి.
ప్రేమ అంటే రెండు హృదయాల స్పందన ఒక్కటనే భావన.
అరమరికలు చూడనిది.
హృదయపూర్వకంగా ఉండేది.
ప్రేమ హృదయసంబంధి.
నిజమైన ప్రేమ దేహవాంఛలకు
లొంగనిది.
అది ఎంతో గౌరవప్రదమైన భావనది.
నిజమైన ప్రేమలు వర్థిల్లుతాయి.
నీచమైన ప్రేమలు కాలగర్భంలో కలిసిపోతాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి