ఋతురాగాలకు పల్లవిగా
గత కాలానికి వారధిగా
సతతమూ సారధిగా
జతగా నడిపిస్తూ గమనించే
జగచ్చక్షువుకు వందనం.
నింగికి ఆభరణంగా
నేలకు ఆధారంగా
గాలికి కారణంగా
నీటికి చేదోడైన
నిప్పంటి దీపానికి వందనం.
నాలోని కలతలకి
నా కున్న వెతలకు
రేపంటి కానుకనిచ్చి
రెప్పల్లే కాపుకాసే
గొప్ప మనసున్న దైవానికి వందనం
ఆశలకు నీరుపోసి
పాశాలకు బందీ చేసి
అహానికి బానిసచేసి
ఇహమే శాశ్వతమనుకునే
మోహానికి కళ్లెం వేసే మాలికి వందనం
ప్రతి దినమూ ఏతెంచి
ప్రతి మనమూ మురిపించి
ప్రతి అణువుకూ ప్రాణమిచ్చి
ప్రతి క్షణమూ పరిరక్షించే
ప్రత్యక్ష నారాయణునికి
శతాధిక నమస్సులతో
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి