గుర్తించలేం!!?:- డా ప్రతాప్ కౌటిళ్యా
రాతను 
ఏ చేతితో వ్రాసినామనీ
గుర్తించలేము.!?
ఎవరి చేతితో రాసినారనీ
గుర్తించగలరు.!!

మోడీజీనీ
ఏ కన్నుతో చూసినామని 
గుర్తించలేము.!?
ఎవరికన్నుతో చూసినామని 
గుర్తించగలం.!!

పిలుపును 
ఏ చెవితో విన్నామనీ
గుర్తించలేము.!?
కానీ ఎవరి చెవితో విన్నామనీ
గుర్తించగలం..!!

** ‌***** ‌** ‌ ***

ప్రపంచము 
ప్రేక్షకురాలు-వ్యాఖ్యాత మాత్రమే 
అది ఆట ఆడదు నేర్పించదు గెలిపించదు!!?

నీ ఆటను -నిన్ను -నీవు 
అద్దంలో ఆసొంతము చూడలేవు!!?

నీ ఆలోచనలను ఆసాంతము
నీ మెదడులో నీవు భరించలేవు!!!?

యుద్ధంలో 
విజయమో వీర స్వర్గమో వస్తుంది!.

అద్దంలో నీడలు- మెదడులో ఆలోచనలు -
ఆటలు -కూడా అంతే!!!?

డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు