నాంచారి పల్లి చెరువు గట్టున రెండు కొబ్బరి చెట్లు ఉండేవి. ఒకటి చెరువుకు దూరంగా ఉన్నది.నీరందక వంకర తింకరగాపెరిగింది.ఇంకొక చెట్టు చెరువు కట్ట పైన ఉన్నది.చెరువులో నీరందడంవలన సుఖంగా పెరిగింది.గుత్తులు గుత్తులుగా కొబ్బరి కాయలు కాసేది.ఊరిలోని వారందరు దైవపూజలకు ఈ చెట్టు దగ్గరకు వచ్చి కాయలు తెంపుక పోయేవారు.
అందుకని పొగరెక్కువైంది.ఏ చెట్టు మాటలు కూడావింటలేదు.
ఒకసారి వంకర కొబ్బరి చెట్టు వద్దకు వెళ్లింది.చూశావా!వంకరి దానా!నావద్దకే ఊరివారందరు వచ్చి కొబ్బరి కాయలను తీసుకొని పోతున్నారు.నీ వంకర ముఖాన్ని చూడడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడడంలేదు.
ఎందుకు నీకీ జన్మ!యాళ్ళపొద్దుగాల చావని పొగరుబోతుచెట్టు తిట్టి వచ్చింది.వంకర చెట్టు ఏమి మాటాడలేదు.మౌనంగా ఉండిపోయింది.
కొన్ని రోజుల తర్వాత కట్టను వెడల్పు చేయడానికి ఇంజనీర్లువచ్చారు.ఈ కొబ్బరి చెట్టు కట్ట మధ్యలో ఉంది.దీన్ని తొలగించాలని నిర్ణయించారు. జేసిబీ దెచ్చి కొమ్మలు,కాయలు తొలగించు చున్నారు.పొగరు చెట్టుకు ఏమిచేయాలో తోచడంలేదు.నా జీవితం ఈరోజు నుంచి ముగుస్తుందని భయపడుతుంది.అప్పుడు వంకర చెట్టు దగ్గరకు వెళుతుంది.చూశావా!మిత్రమా!నన్ను ఎలాచేస్తున్నారో చూడు అని వేడుకుంటుంది.ఏదైన సలహా ఇవ్వవా అని వేడుకుంటుంది.అప్పుడు వంకర చెట్టు పొగరుబోతు చెట్టును తీసుకొని అధికారుల దగ్గరికి వెళుతుంది.ఒక చిట్టి రాసి అధికారికి ఇస్తుంది.అందులో ఇలా రాసి ఉంది.చెట్లను పెంచడం అందరి బాధ్యత.చెట్లను నరకడం మహాపాపం.అనుకోకుండా తొలగించాల్సి వస్తే ఆ చెట్టును వేర్లు నాశనంకాకుండా వేరేచోట పాతాలి అని రాసిఉంది.అప్పుడు అధికారులందరూ విషయాన్ని ఆలోచించారు.అందరూ చెరువు కట్ట వద్దకు వచ్చారు. ఈ పొగరుబోతు చెట్టును వేర్లతో సహా పెకిలించారు.ఎక్కడ సరియైన జాగదొరకక వంకర చెట్టు దగ్గర పెట్టారు.అది నాటుకునే వరకు నీళ్లు పోయడం జరిగింది. అప్పుడు పోయిన ప్రాణాలు మళ్లీ వచ్చినంత పనైంది. బాధపడుతూ వంకర చెట్టు దగ్గరికి వెళ్లి తలవంచుకొని నిలబడింది.
మిత్రమా! నన్ను క్షమించు నా కళ్ళు తెరిపించావు.ఎవరిని కూడా ఎగతాళి చేయొద్దని తెలుసుకున్నాను అని పొగరుబోతు చెట్టు బాధపడింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి