ఆంగ్ల సాహిత్యంలో డాంటే రాసిన "ది డివైన్ కామెడీ" కి ప్రత్యేక స్థానం ఉంది.తన జీవితం ఆఖరిదశలో ఈకావ్యరచన మొదలుపెట్టిన డాంటే1321లో ముగించి కన్నుమూశాడు. వింత అద్భుత యాత్ర లో నరకం ,పాపవిమోచనలోకం ,స్వర్గం ని గూర్చిన వర్ణన చేశాడు.కవి చీకటి నుండి వెలుగులోకి రకరకాల పాత్రలను కల్సుకోటం ఇందులోని కథాంశం.ప్రాచీన రోమన్ చరిత్ర తన కాలంనాటి వ్యక్తులు మిత్రులు శత్రువులని గూర్చిన కవితాత్మక కావ్యం గామలిచాడు డాంటే! ఇటాలియన్ భాష లోని ప్రగతి మార్పులకు ఉదాహరణ ఈకావ్యం.శక్తివంతమైన భావాల్ని స్పష్టంగా ప్రకటించిన రచయిత మాకెవెల్లి."ది ప్రిన్స్" అనే తన గ్రంథంలో పాలకుల విధివిధానాలు తన భవిష్యత్తును తానే మనిషి నిర్మించుకోవాలని కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు.పాలిటిక్స్ రాజకీయాలు
మనిషి ఊహకి కాక ప్రాక్టికల్ గా ఆలోచించి అమలచేయాలని తేల్చి చెప్పాడు.డోరతీ 4వ ఏటనే " హౌ ది వరల్డ్ బిగాన్" అనే పుస్తకాన్ని1962 లో రాసింది.1964 లో అది పబ్లిష్ ఐంది.అతిపిన్నవయసులో రచయిత్రి ఐంది.తన నాన్నమ్మ అమ్మమ్మల కోసం రాసింది ఆచిన్నారి.ఆమె తల్లిదండ్రులు పబ్లిష్ చేసి ప్రోత్సాహించారు.
2010లో అతి పెద్ద భారీకాయం గ్రంథం 1420కె.జి.ల బరువున్న "ఫ్రగైల్ నేచర్". ఇద్దరు హంగెరీ వాసులు 25మంది వాలంటీర్ల సాయంతో 2010లో పబ్లిష్ చేశారు.4.18మీటర్లు ×3.77మీటర్ల తో తయారైన భారీ గ్రంథం అది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి