స్వాతంత్య్రపు తోటకు పరిమళం మీరే
రక్త తర్పణంతో పూసిన పుష్పాలు మీరే
మంచుకొండల్లో మండే సూర్యులు మీరే
మనదేశ సరిహద్దుల్లో నిఘాడేగలు మీరే
కన్నవారి కలలు...
కట్టుకున్న భార్యల కన్నీళ్లు...
పిల్లల అల్లరి చేష్టలు ఆకలికేకల కన్న...
త్రివర్ణపతాకం వందేమాతరమే మిన్నగా
దేశరక్షణకై ప్రాణాలొడ్డి అమరులైనారు..!
మీ జీవితాల్ని ఫణంగా పెట్టి...
దేశసరిహద్దుల్లో మంచుకొండల్లో
రాత్రింబవళ్ళు పహారా కాస్తూ...
మీ గుండెలను బలిపీఠాలుగా మార్చి...
ఆ శత్రుమూకల్ని సింహాల్లా ఎదిరించి...
భరతమాత నుదుట రక్తతిలకం దిద్దేరు..!
ఓ అమర వీరులారా..! మీకు జోహార్లు..!
మీ త్యాగాలే మాకు దారి దీపాలు...
మీ అడుగుజాడలే స్ఫూర్తి కిరణాలు...
మీకు మరణం లేదు మిమ్మల్ని మరవలేం!
మీ అమరత్వానికి శతకోటి వందనాలు..!
మీ ప్రాణత్యాగం...సదా చిరస్మరణీయం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి