వీరాంగనలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 1857 సిపాయితిరుగుబాటులో అవంతీబాయి లోధీ పాల్గొన్నది. కానీ చరిత్ర మరుగున పడిన మాణిక్యం.16 ఆగస్ట్1831లోమధ్యప్రదేశ్ లో జమీందారీ వంశంలో పుట్టింది.రాంగఢ్ రాకుమారునితో పెళ్లి ఐంది.భర్త మానసిక రోగి.ఆంగ్లేయులు అతని రాజ్యాన్ని ఊడలాక్కున్నారు.కానీ అవంతీబాయి ఎదిరించింది.మూడోసారి వారి దాడితో అడవిలో దాక్కుని రీవా సైన్యం సాయం చేస్తుందని ఆశించింది. కానీ వారు ద్రోహం చేయడంతో కత్తితో పొడుచుకొని బలైన వీరనారి. ఇలా అవంతీబాయి లోధీ చరిత్ర లో నిలిచింది.రాణీ తపస్విని పీష్వా నారాయణ రావు పుత్రిక. బాలవితంతువైన ఆమె అసలుపేరు సునంద. ఆంగ్లేయుల బారినుంచి తప్పించుకుని నైమిశారణ్యం వెళ్లి గురువు సంత్ గౌరీశంకర్ ఆదేశంతో శివారాధనలో ఉన్న ఆమె 1857లో సమరంలో దూకింది. శాయశక్తులా పోరాడి నానాసాహెబ్ తో కలిసి నేపాల్ చేరింది.అక్కడనుంచి కలకత్తా చేరిన ఆమె"మహాభక్తి పాఠశాల " ను నెలకొల్పి ఆడపిల్లలకు శిక్షణ నిచ్చింది.వారిలో దేశ భక్తిని రగిల్చింది. 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన రాణి తపస్వినీ1907లో మరణించింది.🌹
కామెంట్‌లు