పచ్చని కాపురం అంటే...?
ఒక గదిలో
ఒకే పరుపుపై
పరవశించటం కాదు...
పకపకమని నవ్వుతూ
నిజానికీ దూరమవటం కాదు...
పదిమందిని కనటం అసలే కాదు..!
పచ్చని కాపురం అంటే...?
సిగ్గూ...సంయమనం మర్చిపోయి
ఇళ్ళిళ్ళు తిరుగుతూ శునకంలా
కుండల్లో కూడును దొంగిలించడం కాదు..!
పచ్చని కాపురం అంటే...?
ఒకే ఆకులో విందుభోజనం,
అదే నిజమైన అర్థనారీశ్వరతత్వం..!
వేరు వేరు అని చెప్పటం
విదేశీయుల వింత పదం...
అది మీ హృదయాల్లో ఉంటే
దాన్ని విషంలా వెళ్ళగ్రక్కండి..!
కలిసి మెలిసి ఉండటమే
మహాత్ముల సందేశం...
మహనీయుల బోధనం...
ప్రేమమూర్తుల ఆత్మీయ ఆజ్ఞ...
అట్టి పాదాలకే భక్తితో మ్రొక్కండి..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి