శహభాష్: .. కోరాడ నరసింహా రావు.
వి షా ద పు బ్రతుకుల్లో 
హా స మా....! 
  అది బ్రతుకు తెరువు కోసం వేసే వే ష ము...!! 

తాను తనివి తీరా... 
 మనసునిండా , నవ్వలేక పోయినా.... 
  అందరినీ నవ్వించ టానికి  
  నిత్య జీవితంలో బఫూన్ లుగా నటిస్తున్న వా రెందరో...!! 

ఈ ప్రపంచ రంగ స్థలం పై  ఒకమనిషికి ఎన్నో పాత్రలు
బిడ్డ,అక్క,అన్న,తమ్ముడు అమ్మ,నాన్న... భార్య, భర్త 
 తాత, అమ్మమ్మ,నానమ్మ!
   ఈ కుటుంబ పాత్ర లన్ని మెప్పిస్తూనే...యింకాసంఘ జీవనం లో సామాజిక పాత్ర లింకెన్నో...!! 

ముఖానికి రంగులుపూసు కుని నటించే సాధారణ నటుల కన్నా...నిజ జీవితంలో  నటించే సహజ నటన... గొప్పది కదూ...! 
   యేది యే మైనా... ఈ బ్రతుకు నాటకంలో ఎవరి పాత్రవారు, ఎప్పటి పాత్ర అప్పుడు చక్కగా నటించి  శహభాష్ అనిపించు కోవటమే గొప్పతనం...! 
     *****


కామెంట్‌లు