కలర్స్(రంగులరాట్నం):- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 జననానికి మూలం ఎరుపైతే,
మంగళమయ జీవనానికి పసుపు సంకేతం.
ఆకుపచ్చ అందమైన జీవితానికి శ్రీకారం చుట్టుతుంది.
నారింజ నాణ్యతను పెంచే సాధనమై,
ప్రశాంత గమనానికి తెలుపే
ఆధారమవుతుంది.
నీలం నిజాలను నిగ్గుతేలుస్తూ వెళుతుంటే,
చిలకపచ్చ నూతన ఆశలను చిగురింపజేస్తుంది.
చిత్తాన్ని స్థిమితపరిచే గోధుమరంగు,
హుషారెక్కించి వదులుతుంది ఊదారంగు.
నిరసనకు కేతనమై రెపరెపలాడును నలుపురంగు.
వెరసి జీవితం వర్ణమయమై నిత్యచైతన్యంతో కొనసాగుతుంది.
రంగులు వెలిసి మోడై పోయినప్పుడు,
ఆత్మ పరమాత్మను చేరుతుంది.

కామెంట్‌లు