ఆలోచనలు....:- ప్రమోద్ ఆవంచ - 7013272452

 మనసు నిత్యం ఏవో కబుర్లతో 
కాలక్షేపం చేస్తుంది 
అవి మన ఆలోచనల్లా వందల్లో 
ఉంటున్నాయి 
కబుర్ల లాంటి కొన్ని ఆలోచనలు  
మానసికానందాన్ని ఇస్తాయి  
ఆ ఆలోచనల కబుర్లు మనసుతో 
ముచ్చటిస్తూ 
మంచు శిఖరాలలో విహరింపజేస్తాయి
జీవితమంతా ఊహల్లో బతుకుతూ
తెలియని ఆనందం పొందుతాం 
ఊహలు..ఆలోచనలు.. కలలు..
ఎన్నో .. అన్నీ తారాస్థాయిలో
ఉంటాయి 
మరెన్నో మనసు కాన్వాస్ పై
 చెరగని ముద్ర వేస్తాయి 
లక్షల్లో వేతనం లేని ఆలోచనలు నిత్యం 
మనసును పురుగుల్లా 
తొలుస్తుంటాయి 
రంగుల ప్రపంచం నీ కళ్ళ 
వాకిళ్ళలో 
కనిపించేలా చేస్తాయి 
వెలిగే చిత్రాలు 
వెలిసిపోయిన ఆకర్షణలు 
కదిలే కాలాలు 
కదిలించే అభిమానాలు 
కరిగే వయస్సులు
ఒడుపు తప్పిన అడుగులు 
ఒరుసుకు పోయే ఆలోచనలు 
కరుసుకుపోయే నాలుకలు
కౌగిలింతల సరసాలు 
ఆధ్యంతం ఆలోచనలకే పరిమితం 
ఆవులిస్తే ఆలోచనలు
అరిగిపోని ఆలోచనలు 
ఊటలా ఆలోచనలు 
ఉప్పొంగే ఆలోచనలు 
నలుపుల ఆలోచనలు
గెలుపుల ఆలోచనలు 
విరిగిన మనసులను 
ఊరడించే ఆలోచనలు 
ఆ ఆలోచనలకు సమయం 
సందర్భం లేదు 
నిర్ధిష్టమైన పనిగంటలు లేవు 
మెళకువగా ఉన్నంతకాలం వాటిని 
ఆపడం ఎవరి తరం కాదు 
మస్తిష్క గడియారం నిరంతరం 
ఆలోచనల యంత్రం 
జీవితం ఆగిపోయే గంట...
చుట్టూ ముసురుకున్న ఆలోచనలు
చెల్లాచెదురు ...
                      
కామెంట్‌లు