చూడ ముచ్చట.........సీతారాముల కాల్యాణం..!:- 'సాహితీ శిరోమణి’'సాహితీ ధురీణ''వాజ్ఞ్మయ భూషణ' '' కావ్యసుధ '' 9247313488 హైదరాబాదు
శ్రీరామ కథ భక్తులకు 
ఎప్పటికీ ఆపాతమధురమే !
రామాయణంలో 
సీతారాముల కాల్యాణం
కమనీయ రమణీయ ఘట్టం.
ఆ కాల్యాణముకై జనకుడు విధించిన 
శివ ధనుర్భంగము చేసి 
సీతను చేపట్టాలి....
రాజులు ఒక్కొక్కరు వస్తున్నారు..... 
తమ శక్తి సామర్థ్యాలను
ప్రదర్శించి వెళ్తున్నారు.
శివ ధనస్సును విరిచేంతటి 
పరాక్రమం వారిలో లోపించింది.
ధనస్సును ఎత్తడానికే ఆపసోపాలు పడుతున్నారు 

ఓరకంటగా....సీతమ్మ వైపు 
శ్రీరాముడు చూస్తున్నాడు...
రామయ్య వంతు......రానే వచ్చింది.
 శివ ధనస్సును ఒక్క ఉదుటనలేపి...వంచాడు.
రామయ్య పై పూల వర్షం కురిసింది. 
సిగ్గులోలుకుతున్న సీతమ్మకు 
పరిణయ మాడటానికి 
వేదికగా నిలిచింది.
సీతమ్మ తనకే సొంతం అన్నట్లుగా..
రామయ్య విజేతగా నిలిచాడు.

ఆకాశమంత పందిరి....
భూమండలమంత వాకిలి....
నును సిగ్గులోలుకుతున్న 
సీతమ్మ పెళ్లి పీటపై కూర్చుంది 
సీతమ్మ కంటి రామయ్య 
అందంగా ముస్తాబయ్యాడు.

కాల్యాణ ఘడియ రానే వచ్చింది...
తన రాజ్య ప్రజలు చూస్తుండగానే....
రామయ్య సీతమ్మ మెడలో 
మూడు... ముళ్ళు వేశాడు.
ఆ దృశ్యం ఇంతవరకు.,..
భువిలో చూడనిది.
సీతారాముల కాల్యాణం 
తిలకించడానికి ముక్కోటి
దేవతలు భూమికి 
దిగివచ్చిన క్షణమది.

కాల్యామంటే 
సీతారాముల కాల్యాణం ! 
వైభోగం అంటే                          
సీతారాములదే.....!

భద్రాద్రి లో జరిగే కాల్యాణం
కడుకమనీయం....
చూసేవారికి చూడముచ్చట 
పుణ్యపురుషులకు...... 
ధన్య భాగ్యమట......
సీతారాముల కాల్యాణం                                                         
చూసి తరిద్దాం రారండి..!


కామెంట్‌లు