శ్రీరాముని బాటలో నడుద్దాం.!.!:- 'సాహితీ శిరోమణి’'సాహితీ ధురీణ''వాజ్ఞ్మయ భూషణ' '' కావ్యసుధ '' 9247313488 హైదరాబాదు
  మన భారతీయ హైందవ సాంప్రదాయంలో పండుగలకు అత్యంత ప్రాధాన్యతవుంది. ప్రతి పండుగ వెనుక ఒక  విశిష్టత ఉంటుంది.
చైత్ర శుద్ధ నవమి సీతారామ కాల్యాణ మహాత్సావం.
            శ్రీరాముడు కౌసల్య గర్భములో , చైత్ర శుక్ల నవమి తిథిలో పునర్వస నక్షత్రం నాలుగవ పాదములో  గురువు, చంద్రుడు కలసియున్న కర్కాటక లగ్నంతో ఐదుగ్రహలు రవి, గురు, శని, అంగారక, శుక్రులు ఉచ్చ స్థితిలో ఉండగా అవతరించాడు..
    దుష్ట శిక్షణ శిష్టరక్షణ, ధర్మ రక్షణార్థం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అనేక అవతారాలనెత్తి ఎన్నో దివ్యాత్మాక సందేశాలను మానవాళికి అందించాడు. శ్రీహరి ధరించిన అవతారాలన్నింటిలోనూ పరిపూర్ణమైనది రామావతారమే. 'రా ' అనేనది తత్ పదార్థం. భగవంతుడు మకారము 'త్వం' పదార్థం అనగా జీవుడు ఈరెండింటినీ కలిపితే ' రామ' అవు తుంది. ఈ జీవుడు కూడా బ్రహ్మయే తప్ప పేరు కాదు.
మానవ జన్మనెత్తి సామాన్య మానవుడుగా జీవించి, ఈ సమాజంలో వ్యక్తి ఏ విధంగా జీవిస్తే జీవనం సులమయమౌతుందో తన జీవన విధానం ద్వారా స్పష్టంచేశాడు సకలగుణ సంపన్నుడు శ్రీరాముడు.
సమత, దయ, అహింస, క్షమ, ఆత్మవిశ్వాసం శ్రీరాముని లక్షణం. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. ఏకపత్ని వ్రతుడు శ్రీరాముల దాంపత్యం లోకానికి ఆదర్శవంతమైంది. సూర్యవంశ, చంద్ర లగ్న సంజాతకుడైన శ్రీరాముని చంద్రలగ్నం 'భ' చక్రంలో నాలుగవది. చంద్రుని రాశి అయిన కర్కాటకం. చంద్రుడు ఇటు కేంద్రంగా అటు కోణంగా  పిలువబడుతున్న లగ్నములో భాగ్యాధిపతి అయిన ఉచ్చ గురువుతో కూడి ఉండుట, శుక్రుని ఉచ్చస్థితి నొందగా 
శ్రీ మహాలక్ష్మి అంశతో జన్మించిన సీతాదేవి శ్రీరాముని ధర్మచాణినియైనది.
 శ్రీరాముడు దాసులకు దాసుడు. తనపై  అచంచలమైన విశ్వాసముంచిన వారిని సర్వ ఆపదల నుండి కాపాడుతాడు. " శ్రీరామ జయరామ జయ జయ రామ " అనునది ఆత్మ శక్తి ప్రసాదించే ఏకైక తారక మంత్రం. ఇది శాంతి,సౌఖ్యాలు అనుభవింప చేయగల మంత్ర రాజము. శ్రీరామ మంత్రము బ్రహ్మ ,విష్ణు, రుద్ర మహేశ్వర సదాశివులనెడు పంచకర్తల సృష్టి ,స్థితిలయ తిరోధాన అనుగ్రహములకు ముఖ్య కారణమును, సర్వాతిశయమును అయిన తారక బ్రహ్మమును తెలియజేయు ధర్మార్థ, కామ, మోక్షముల నిచ్చునది శ్రీరామ మంత్రం.
     ప్రతి వ్యక్తి జీవితంలో శాంతి, సౌఖ్యాలు రావాలంటే రామతత్వం అలవర్చుకోవాలి.
 త్రేతా యుగమున శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం, సత్యాన్ని, ధర్మాన్ని పాటించాడు అట్టి ధర్మ మార్గంలో మనమూ నడుద్దాం...! శ్రీరామునికి ఆదర్శంగా నిలుద్దాం..!

కామెంట్‌లు