కొన్ని మినీలు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
మనస్సుకు మార్ధవంలేకుంటే ఎలా?
వైరాగ్యం
భవబంధాల్ని దూరం పెడుతుంది

పల్లెకు సొగసులద్దుతున్నారు
తల్లిని సవితి తల్లిని చేయకు

కాలమెప్పటికి ఓడిపోదు
వ్యక్తులే ఓడుతారు
కాలపరీక్షన నెగ్గితే ఓటమిభయముండదు

ఎవరో ఒకరిని నమ్మాలి
నమ్మకమే జీవితం గదా!

బాధనెవడు కోరుకుంటాడు
అది ఆడే బంతి కాదు
బండకేసికొట్టడానికి

అంతా డబ్బున్నోళ్ళే
కరెన్సీకి కావలసిన బంధువులు
నోటులేనోడిక్కడ
నోటమాటరాని మూగవాడే

గొప్ప కవితే
రాయిలా విసురుతావెందుకు?!
రోజాపువ్వులా
చేతికందించలేవా!? 

ఎంత పచ్చిగా
 ఉందామాట!
దాపరికం లేనప్పుడు అంతేమరి!?

నేనెప్పటికి తప్పు చేయను
లోకులు చూడని నీతప్పులు
లోకనాయకుడు చూస్తాడు!?

కాలమెప్పడైనా
ఆగిపోతుందా!
వాయిదా తత్త్వం మన తిరోగమననానికి సంకేతం

కాలం అనునిత్యం
పరీక్షలు పెడుతూనే ఉంటుంది
నెగ్గితే విజయకేతనం
ఓడితే మరో ప్రయత్నం

మేకపోతు గాంభీర్యం 
ఎంత కాలం ప్రదర్శిస్తావు
బీరత్వమున్నంతకాలం ఓటమే
ధీరత్వం చూపు గెలుపు గీతం పాడు

తీరని దుఃఖం
అయినవాళ్ళంతా మటుమాయం
జలసమాధైన బ్రతుకులు
మిగిలినోళ్ళకు శోకగీతం

పేదలకే కాదు శ్రీమంతులకు
దుఃఖముంది
కళ్ళతో బాధను సంతోషాన్ని
సమంచేయకతప్పదు

కొయ్య అనకుదాన్ని
దారుశిల్పి 
ఉలిపలకరిస్తే
జీవం ఉట్టిపడదా!?

గుడ్డివాడు
గడియారాలమ్ముతుంటే
కాలము
తన అదుపులో ఉన్నట్టనిపిస్తుంది

కక్ష కార్పణ్యం
దానవ దమననీతిసూత్రం
క్షమ,జీవకారుణ్యం
మానవీయ గుణం 


కామెంట్‌లు