అడవి తల్లి ఆవేదన
ప్రతి రోజు రోధన
నా హృదయంపై పోట్లు
ఓజోన్ పోరకు తూట్లు
నా తనువుకు పెడుతున్నారు చిచ్చు
మీరు తెచ్చుకుంటున్నారు పెను ఉచ్చు
నా బిడ్డల ( చెట్లు ) అరుపు
మీ చెవులకు వినబడని పిలుపు
మీ కడవరకు ఉంటాను తోడు
నా గురించి తెలుసుకోరు ఎన్నడూ ( చెట్లు నరకొద్దని )
ఔషదాన్ని నేను మీ రోగికి
సేద తీర్చుతున్న మీ తనువుకి
తీర్చలేరు నా లోటు ఎన్నటికీ
గునపంతో పొడుస్తున్నారు నా పేగులపై ( వేర్లు ) పోట్లు
ఆధారం లేకుండా తీసివేస్తిరి నన్ను
కరువు కాటకాలతో తెచ్చుకుంటున్నారు పాట్లు
కాకులు దూరని కారడవిని చేస్తిరి ఎడారిని
అడవి బిడ్డలే నాకు రక్షణ
లేకుండా చేస్తిరి వారికి రక్షణ
నా తల్లి భూతల్లి
మీ తల్లి ఏ తల్లి?
అడవి తల్లికి చేస్తిరి పాపం
అందుకే మీకు అవుతున్న దూరం
అందుకే కండ్లు తెరవండి
ప్రతి ఒక్కరు ఒక్క మొక్కను పెంచండి
వృక్షో రక్షతి రక్షః ధర్మాన్ని పాటించండి
మొక్కలు పెంచితేనే మహా అరణ్యాలు అవుతాయి
ప్రాణాధారమైన వర్షాధారనిస్తాయి
మొక్కల పెంపకం చేపట్టండి
పర్యావరణాన్ని రక్షించండి
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపండి
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
అని తెలియజేయండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి