అల్లం బెల్లం :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పల్లె తల్లి వచ్చింది 
అల్లం బెల్లం తెచ్చింది 
మూట కట్టి పెట్టింది 
పిల్ల చేతికి ఇచ్చింది 

మూట చేత పట్టుకుని 
పల్లె బాట పట్టింది 
ఇల్లు చేర వచ్చింది 
తల్లికి ఆమె ఇచ్చింది 

ముల్లె విప్పి చూసింది 
అల్లం బెల్లం తీసింది 
గిన్నెలోనా కాచింది 
అల్లంరబ్బ చేసింది 

కంచంలోకి వంచింది 
బిల్లలు బిల్లలు కోసింది 
అందరు కలిసి తిన్నారు 
ఆరోగ్యంగా ఉన్నారు 


కామెంట్‌లు