ఓ మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
ఇదిగో చూడు...
నీ తల నుదిటిని...
ఆకాశపు అంచుల్ని తాకుతూ...
శిరమెత్తి చిద్విలాసంతో విర్రవీగే...ఆ
శిఖరాల...జాతకాలు రేపు తారుమారే...
తప్పదు వాటికి రేపు గర్వభంగమే..!
ఒక్కసారి నీలోని
అగ్నిజ్వాలలను రగిలించు..!
నీ పట్టుదలనే పతాకంగా ఎగరెయ్..!
శ్రమయే నీ ఊపిరిగా..!
సహసమే నీ రథసారథిగా..!
సాహసమే నీ ఆయుధంగా..!
తడబడినా అడుగు గమ్యం వైపేవేస్తే.!
కసితో...కృషితో...పట్టుదలతో
కఠోర సాధనతో...అఖండ దీక్షతో
ఆ పర్వత శిఖరాలనధిరోహిస్తే..!
ఓ శ్రమజీవి! ఓ సాహసి..!
నిన్నటిదాకా నీవు
నమస్కరించిన ఆ శిఖరాలే... నేడు
నీకు తలవంచి నమస్కరిస్తాయి..!
నీ పాదాలను ముద్దాడుతాయి..!
నీ అడుగుల సవ్వడి వింటాయి..!
నీ అడుగుల బరువును
ఆనందంగా గుండెలపై మోస్తాయి.!
కారణం ఇప్పుడవి పునీతమైనది
పట్టుదలకు ప్రతిరూపమైన
నీ పాదాలస్పర్శ తోనే..!
ఔను నీ విజయ దుందుభి
నాదం పర్వత శిఖరాల్ని దాటి
నేడు ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తోంది...!
నలుదిక్కులా మారుమ్రోగుతోంది..!
జయహో...! జయహో అంటూ..!
జయీభవ..! దిగ్విజయీభవ అంటూ..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి