మంచి కవిత
ఒకటి వ్రాస్తావా
మదినిదోస్తావా
మురిపిస్తావా
తీయని కవిత
ఒకటి అందిస్తావా
తేనెచుక్కలు చిందుతావా
నోటిలో నానుతావా
కమ్మని కవిత
ఒకటి వినిపిస్తావా
కోకిలను తలపిస్తావా
రాగాలు తీయిస్తావా
అద్భుత కవిత
ఒకటి అల్లుతావా
అందాలు చూపుతావా
ఆనందము కలిగిస్తావా
చక్కని కవిత
ఒకటి పంపుతావా
పదేపదే చదివిస్తావా
పేరుప్రఖ్యాతులు పొందుతావా
ప్రేమ కవిత
ఒకటి పాడతావా
ప్రణయసాగరంలో ముంచుతావా
అంతరంగంలో కొలువుదీరతావా
పసందైన కవిత
ఒకటి పఠింపజేస్తావా
నవరసాలను త్రాగిస్తావా
పంచేంద్రియాలను తడతావా
కొత్త కవిత
ఒకటి కూరుస్తావా
నవతను చాటితావా
భవితకు దారిచూపుతావా
సందేశాత్మక కవిత
ఒకటి వెలువరిస్తావా
సమాజాన్ని మేల్కొలుపుతావా
సాహిత్యాన్ని సుసంపన్నంచేస్తావా
విన్నూతన కవిత
ఒకటి విరచిస్తావా
సుశబ్దాలు పలికిస్తావా
సంప్రీతిని చేకూరుస్తావా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి