న్యాయములు -836
అభేదకా గుణా న్యాయము
*****
అభేధకా అంటే ఎటువంటి భేధం లేదు.గుణా అనగా స్వభావము, నాణ్యత, విశిష్టత,ఆస్తి అనే అర్థాలు ఉన్నాయి.
గుణ భేదము లేకపోతే, వ్యక్తి భేదమూ ఉండదు అని అర్థము.
గుణ భేదము అనగా వివిధ లక్షణాలు, స్వభావాల పరంగా ఒక విషయం వేరొక దానికి ఎలా భిన్నంగా ఉంటుందో వివరించడం. గుణ భేదము గుణాలను గురించి వివరిస్తుంది.
ఉదాహరణకు ఉప్పు, కర్పూరము చూడటానికి ఒకేలా ఉంటాయి కానీ వాటి గుణాలు, లక్షణాలు వేర్వేరు అలాగే పాలు,కల్లు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి కానీ అవి చేసే పనులు, లక్షణాలు, స్వభావాలు వేరు వేరు.
గుణాలను గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా మూడు గుణాలను ప్రస్తావిస్తూ ఉంటారు మన పెద్దలు మరియు ఆధ్యాత్మిక వాదులు.అవి ఒకటి సత్వ గుణం.రెండు రజో గుణం.మూడు తమో గుణం. ఈ గుణాలు మనిషి స్వభావాన్ని, అతడు ఎలాంటి పనులను చేస్తాడో చెబుతాయి.
సత్వ గుణం అంటే మంచితనం,సత్యం, ప్రశాంతత, సమతుల్యత, శాంతి, సద్గుణాలతో కూడిన గొప్ప గుణం. ఇది ఉన్న వారిలోని స్వభావం జ్ఞానము, ఆనందం వైపు ఆకర్షింప బడుతుంది.
రజో గుణం ఇది కోపం,ఆవేశం, మోహం వంటి భావాలను కలిగి ఉంటుంది.
ఇక తమో గుణం అనగా తమో అంటేనే చీకటి అజ్ఞానం అనే చీకటి, సోమరితనం,నిద్ర అశ్రద్ధ, అపవిత్రతతో పాటు స్వార్థం అనే లక్షణాలను కలిగి ఉంటుంది.
మరి అలాంటి గుణ భేదాలు లేకుండా వ్యక్తులు అందరూ ఒకే గుణాలను కలిగి ఉన్నట్లయితే వ్యక్తుల మధ్య భేదాలే ఉండవు కదా అని అర్థము.
కానీ అది సాధ్యమా? కాదని సామాన్యమైన అర్థంతో అంటే ద్వైతాద్వైత సిద్ధాంతం అవుతుంది అని చెబుతుంది.పరబ్రహ్మమే జీవాత్మలుగా, జగత్తుగా పరిణామం చెందింది. బ్రహ్మము అంటే సగుణ బ్రహ్మమే.అది సృష్టికి నిమిత్త కారణము, భౌతిక కారణము కూడా అవుతుంది అంటూ దానికి ఉదాహరణ కుండను, మట్టిని ఉటంకిస్తారు.కుండకు మట్టి భౌతిక రూపం అయితే,కుండ తయారు చేసే కుమ్మరి నిమిత్త మాత్రుడు.అయితే జీవ జగత్తుల విషయంలో రెండు కారణాలు బ్రహ్మము గానే పిలనబడతాయి.
భేదం - అభేదం అనే విషయానికి వస్తే -తాను సృజించిన జీవుడి కంటే బ్రహ్మము వేరు కాదు.బ్రహ్మం అంశి.జీవుడు అంశము. ఇంకా అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే సూర్యుని కాంతి కిరణాలు -సూర్యని కంటే వేరు కావు.అలాగే సముద్రము - సముద్రములోని అలలు వేరు కాదు.
అలా కాకుండా మరో విధంగా కూడా చెప్పుకోవాలి .గుణ భేదము లేకుండా ఉంటే అందరి వ్యక్తుల లక్షణాలు ఉంటే...అది వ్యక్తిలోని మంచి చెడులు, వస్తువుల అన్ని లక్షణాలు ఒకేలా ఉంటే..విషయ గ్రహణ మరియు వ్యక్తీకరణలో ఒకేరకంగా ఉంటే ఇక సమస్యే ఉండదు.
కుటుంబంలో కానీ, సమాజములో కానీ ఒకేరకమైన మంచి మనస్తత్వం కలిగి ఉంటే ఫరవా లేదు. అంతా ఆనందంగా ఉంటుంది.
అది ఒక కోణంలో మాత్రమే. మరి భేదాలు ఉంటే అది భయంకరంగా ఉంటుంది. అంతా దౌర్జన్యపూరిత రజో తమో గుణాలను పొందిన వారు కలిసి వుంటే అదో పెద్ద సమస్యే.
కాబట్టి గుణ భేదాలు ఉండాలి.ఎవరి అస్తిత్వం వారు కాపాడుకుంటూ కలిసి మెలిసి మంచి మనసుతో సహా జీవనం సాగిస్తూ వుంటే సమాజం విలువలతో కూడి ఉంటుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి