స్నేహ బంధం: - కవి రత్నసాహిత్య ధీర సహస్త్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
చెక్కు చెదరనిది...
ఒక్కటే స్నేహ బంధం..!

గాలి వీస్తే...
ఆరిపోయేది...దీపం 

రోజు గడిస్తే...
వాడి పోయేది...పుష్పం 

మెలుకువ వస్తే... 
చెదిరిపోయేది...స్వప్నం 

చిరు మనస్పర్ధలోస్తే...
చిరగిపోయేది...చిత్తం 

కలతలు పెరిగితే... 
కూలిపోయేది...కాపురం 

విధి వక్రిస్తే విషం చిమ్మితే...
విలవిలలాడేది...మనిషి జీవితం 

పాలకుండలో పడిన 
విషపు చుక్కలా ముడోవ్యక్తితో  
ముక్కలయ్యేది...మూడు ముళ్లబంధం

కానీ ఎన్ని ప్రళయాలు వచ్చినా... 
ఎంతగా విలయతాండవం చేసినా... 
ఎన్ని పిడుగులు పడినా...
ఎన్ని సునామీలు చుట్టుముట్టినా...
చెక్కు చెదరనిది...ఒక్కటే 
రెండు ఆత్మలేకమైన...స్నేహ బంధం..!



కామెంట్‌లు