అవని తల్లి బిడ్డలు:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
అవని తల్లి బిడ్డలు 
ఆకుపచ్చ మొక్కలు 
చిగురించిన వృక్షాలు 
పచ్చపచ్చని హారాలు 

చల్లని గాలిని వీస్తూ
చక్కటి నీడనిస్తాయి
జీవకోటికవి ఎప్పుడు 
ప్రాణాధారం చూడండి 

చెట్లను పెంచండి 
చేటును తగ్గించండి 
అవనికి ఆకాశానికి 
అందమైన పొంతన 

చెట్లు వీచే గాలితో 
నల్లని మేఘాలకు 
చల్లని సంబంధం 
వానజల్లుల బంధం 

తరువులు లేని చోట 
నిలువ లేవు మేఘాలు 
కురవలేవు జల్లులను
మొక్కలను నాటండి 
మక్కువతో పెంచండి
 


కామెంట్‌లు