మాటలు...
మధురమైన మంజీరాలు...
మనసుల్లో సంగీతమై మోగుతాయ్...
పెద్దలు అంటారు...
మాటలు ముత్యాల మూటలని
సాత్వికులు చెబుతారు...
మాటలు మంత్రాలని...
మాటలు మంచు బిందువులని ...
మాటలు...
కోటల్ని తలకిందులు చేస్తాయని...
కోతలరాయుళ్ళ నోట
గుండెల్లో ఈటెలై పొడుస్తాయని...
గునపాలై గుట్టుగా గాయపరుస్తాయని...
మంచి మాటలు
గుభాళించే గులాబీ పువ్వులని...
మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తాయని...
చెడు మాటలు
మనిషిని మట్టిలో
కలిపేసే మృత్యుదూతలని...
మాటల్ని
తూలనాడకూడదని...
ఆచి తూచి మాట్లాడాలని...
మతం విషయంలోనైనా...
ఏ మనిషి విషయంలోనైనా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి