కల-కాలం!!?:- డా ప్రతాప్ కౌటిళ్యా
నిత్య కళ్యాణం పచ్చ తోరణం 
నిన్ను 
దాచేస్తున్న తూర్పున ఉదయిస్తున్నావు!!

మట్టిలో విసిరేసి సమాధి చేసిన 
అరణ్యంలా పుట్టుకొస్తున్నావు!!!

చూపులు తీసి ఇంటిలో దాచిన 
కొత్తగా గాలిలా వ్యాపిస్తున్నావు!!

గుడిగంటలు మోగిస్తూ 
గుండెల్లో మంటలు ఆర్పేస్తున్నావు!!

కోట్ల సంవత్సరాలు కూడా పెట్టిన ఆస్తి 
కాంతిలా 
ఇంటింటి గడప దాటి వస్తున్నావు!!!

గ్రహం పైన వర్షం కురుస్తున్న 
ఆకాశం పైన 
డేగలా ఎగిరి వస్తున్నావు!!!!

రాలిపోయే నక్షత్రం కూలిపోయే కట్టడం కాదు 
కల-కాలం , కలకాలం కలిసిపోయే విచిత్రం నీవు!!

ముగుస్తున్న యుగం అధ్యాయం నీవు 
తెరుస్తున్న పుస్తకం ముందుమాట నీవు!!!!

రజితం కనుగొని స్వర్ణం గెలిచిన నీవు 
స్వర్ణం కనుగొని రజితం సంపాదించలేవా!!!

కన్నులు ఉంటేనే కదా వెన్నెల అయ్యేది 
ఇంద్రుడు అయితేనే కదా 
చంద్రుడయ్యేది!!!?

లెక్కలు తప్పని చక్కని చుక్కవు నీవు 
కల-కాలం, కలకాలం నీవు!!?

ప్రేమతో అమ్మ సుజాతమ్మకు. 

డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు