ఎన్ని జ్ఞాపకాలో.. : ఉమా గాంధీ

 నాతో పాటే ఉన్నత పాఠశాలకి ప్రమోట్ అవుతున్న ఐదవ తరగతి విద్యార్థులు..అప్పుడప్పుడూ వీరు బయట కాలుష్యానికి మరకలు పడుతున్న గాజు బొమ్మలు.ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లాగా, అక్కాచెల్లెళ్ళ లాగా ఒకరికొకరు కలసి మెలసీ  ఆప్యాయంగా పిలుచుకునే టోళ్ళు..ఇప్పుడు వేర్వేరు స్కూళ్ళ కి బోయి ఎటువంటి స్నేహితులతో జత కడతారో మరి.!ఆకలి, అవసరాలు వల్ల ఈ వలస పక్షుల జీవితాలు ఎక్కడకి చేరుతాయో మరి..!వీరితో ఎన్ని గొడవలో..వీరి తల్లి దండ్రులతో ఎన్ని జ్ఞాపకాలో..
బడికి వస్తే చాలు చుట్టూ చేరిపోయి చెవిలో రకరకాల కువకువలు..వారి ఇంటి విషయాలే కాదు..వినాలి గాని, 
విశ్వం చుట్టేసే విధ్వత్తు వీరిది.. తొమ్మిది నెలలు పురిటి నొప్పులు భరించి, కనిన పిల్లాడిని వేరే ఎవరో తన్నుకు పోయినట్టు గా..
పిల్లలకి టీచర్లకి మధ్య ఒక అవగాహన, అనుబంధం ఏర్పడే సమయంలో..విడిపోవడం, అక్కడ పరిసరాల ప్రభావం ఉపాధ్యాయులకు, విద్యార్థులపై ప్రభావం చూపుతుంది.ఈ అనుభవాలు ప్రతీ టీచర్ కి జరిగేదే అయినా..మరొక్కసారి ముందుకు జరిగే ముందు వెనక్కి చూసుకున్నాను...ఈ చిట్టి చిట్టి పిల్లలతో పాతికేళ్ళ సహవాసం జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చినట్టి,గురూత్వం, 
అటువంటి జ్ఞాన సరస్వతి పీఠం,శివాజిపాలెం పాఠశాల ఈ గురువమ్మకు అమ్మలా అన్ని అవసరాలు తీర్చిన కల్పతరువు అని చెప్పవచ్చు..
కామెంట్‌లు