పురాతన గ్రీస్‌లో ఒకానొకప్పుడు మహిళలు వైద్య విద్యను చదవడానికి వీల్లేని విధంగా చట్టాలు ఉండేవి. అయితే ఈ చట్టాన్ని ఉల్లంఘించిన తొలి మహిళా ఆగ్నోడైస్. అదెలా జరిగిందో తెలుసుకుందాం.
క్రీస్తు పూర్వం 300లో జన్మించిన ఆగ్నోడైస్ తన జుత్తును కత్తిరించుకుని పురుషుడి వేషంలో అలెగ్జాండ్రియా వైద్య విద్యాలయంలో చేరింది.
వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసిన ఆగ్నోడైస్ ఓరోజు ఏథెన్స్ వీధుల్లో నడిచి వెళ్తుండగా ఊహాతీత సంఘటన జరిగింది.
ప్రసవ వేదనలో ఉన్న ఒక మహిళ ఏడుపులు ఆగ్నోడైస్ కు వినిపించాయి. వెంటనే ఆమె ఆ మహిళ వద్దకు వెళ్ళింది తనవంతు సాయం చేయడానికి.
అయితే, ఆ స్త్రీ ఆగ్నోడైస్‌ను పురుషుడిగా భావించి తీవ్రమైన నొప్పితో ఉన్నప్పటికీ తనను తాకడానికి వీల్లేదని చెప్పింది.
విషయం గ్రహించిన ఆగ్నోడైస్ ఎవరికీ ఏ అనుమానం రానట్లుగా తాను పురుషుడిని కానని, సాటి మహిళనని చెప్పి ధైర్యమిచ్చింది. ప్రసవవేదనతో ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరగడానికి ఆగ్నోడైస్ సహాయం చేసింది.
ఈ విషయం అనతికాలంలోనే ఏథెన్స్ అంతటా తెలిసిపోయింది. అనారోగ్యం తో బాధపడుతున్న మహిళలందరూ చికిత్స కోసం ఆగ్నోడైస్ వద్దకు వెళ్లడం ప్రారంభించారు.
దీంతో మగ వైద్యులు అసూయపడి ఆగ్నోడైస్ పై ఉన్నవీ లేనివీ చెప్పి ఆమెను ఇబ్బందులపాలు చేశారు. ఆమెను పురుషుడిగా చిత్రించి మహిళా రోగులను తన వలలో వేసుకుని దగా చేస్తున్నట్లు ఆరోపించారు.
ఈ వివాదం తారస్థాయికి చేరింది.
ఆమెపై విచారణ జరిపారు.
ఆగ్నోడైస్ న్యాయస్థానంలో జడ్జీ ముందు తాను స్త్రీ అని నిరూపించారు. అంతా విన్న కోర్టు తాను పురుషుడిని అబద్ధం చెప్పి వైద్య కళాశాలలో చదవటం నేరమని, చట్టాన్ని ఉల్లంఘించడమేనని మరణశిక్ష విధించారు. అయితే ఈ శిక్ష కలకాలం రేపింది. మరణశిక్ష విధించిన న్యాయమూర్తుల భార్యలు తిరుగుబాటు చేశారు. ఆగ్నోడైస్‌ను చంపితే, తాము కూడా ఆమెతో పాటు మరణిస్తామని హెచ్చరించారు. ఈ హెచ్చరికతోపాటు ఇతర మహిళల ఒత్తిళ్లను తట్టుకోలేక, న్యాయమూర్తులు ఆగ్నోడైస్ కు విధించిన మరణశిక్షను రద్దు చేశారు. అంతేకాకుండా ఆగ్నోడొస్ వైద్య వృత్తిని కొనసాగించడానికి అనుమతించారు. మహిళలందరూ ఆమె వైద్యం చేయవచ్చని ప్రకటించారు.
ఈ విధంగా, ఆగ్నోడైస్ మొట్ట మొదటి గ్రీకు మహిళా వైద్యురాలిగా చరిత్ర పుటలకెక్కారు. గైనకాలజిస్ట్‌గా ఆమె తనదైన ముద్ర వేశారు. ఆగ్నోడైస్ విధినిర్వహణలో ఉన్నట్లు చిత్రీకరించే ఓ ఫలకాన్ని కూడా రూపొందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి