విక్రమ ధీర -3 : - భరద్వాజ్ , సెల్ : 7075451597

 చందు , తన ప్రింటింగ్ హౌస్ లో వాళ్ళ నాన్న ఫోటో ముందు నిల్చొని, ఈ రోజుకి సరిగ్గా 1 ఇయర్ అవుతుంది నాన్న నువ్ నాకు దూరమై.. అందుకే నువ్ వెళ్లి పోయిన ఈ రోజే నేను కూడా నీ దగ్గరకి వచ్చేస్తాను. అని చందు నిర్ణయం తీసుకుంటాడు.. తరువాత అక్కడ నుంచి పక్క గదిలోకి వెళ్లి, అక్కడ ఒక పెద్ద తాడు తీసుకుని ఆ గదిలోని సీలింగ్ కి ఉరి వేసుకోవాలని అన్ని సిద్ధం చేసుకుంటాడు.. సరిగ్గా ఉరిని తన మెడ కి తగిలించు కుంటున్న టైం లో….
 
“ చందు… “
 
అన్న గొంతు తక్కువ స్వరంతో చాలా ఖచ్చితంగా వినిపించింది.. అది విన్న చందు ఉరి వేసుకోవడం ఆపి ఆ గది మొత్తం పరీక్షగా చూస్తాడు.. అక్కడ తను కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో అని.. కానీ చందు కి అక్కడ ఎవరూ కనిపించలేదు..మళ్లీ తను ఉరి వేసు కోవడం ఆరంభించాడు.. మళ్లీ ఆ గొంతు వినబడింది.. 
 
“ చందు ఇటురా… “
 
అని ఈ సారి ఆ గొంతు చాలా స్పష్టంగా, గంభీరంగా వినబడడడంతో , తన ఉరిని ఆపుకొని కుర్చీ నుంచి కిందకి దిగుతాడు.. ఆ తరువాత ఆ గొంతు చందు ని పిలుస్తూనే ఉంది, చందు ఆ గొంతు వినిపిస్తున్న వైపు , నెమ్మదిగా కదులుతాడు.. అలా ఆ ప్రింటింగ్ హౌస్ లోని మేడ మీద ఉండే స్టోర్ రూమ్ దగ్గరకి వెళతాడు.. ఆ గొంతు స్టోర్ రూమ్ లోపలి నుంచే వస్తుందని, చందు గ్రహించాడు.. లోపలికి వెళ్లాలని చూస్తాడు, కానీ అది లాక్ చేసి ఉంటుంది.. దాని కీ కూడా అతని దగ్గర ఉండదు.. ఆ లాక్ వైపు కాసేపు పరీక్ష గా చూసి, 
 
  “ నాకు తెలిసినంత వరకు, ఈ రూమ్ తాళం నాన్న దగ్గరే ఉండేది.. అది నాన్న ఎవరికి ఇచ్చే వాళ్ళు కాదు.. నాన్న కూడా ఎపుడు ఈ గది ఓపెన్ చేసింది లేదు.. ఆఖరికి ఆయన చని పోయేటపుడు కూడా ఆ కీ ఆయనతో పాటే నాశనం అయిపోయింది.. ఇంతకీ ఏముంది ఈ గదిలో .. నాన్న ఈ గదిని ఎపుడు తెరవక పోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి.. “
 
అని ఆలోచించి, 
 
ఎలాగైనా ఇందులో ఏముందో తెలుసుకోవాలి.. “
 
అని , అక్కడ చుట్టూ దేని కోసమో వెతుకుతాడు.. 
 
    అక్కడ రామ్ ఇంట్లో , రామ్ వాళ్ళమ్మ మైరా కారియర్ సర్దుతూ, 
 
“ రామ్, త్వరగా రా నాన్న స్కూల్ కి లేట్ అవుతుంది.. “
 
అని వంట గది నుంచి రామ్ ని పిలుస్తుంది. అపుడే రామ్ బెడ్ పై కూర్చొని తన షూ లేస్ కట్టుకుంటున్నాడు.. 
 
“ హా వస్తున్నానమ్మా.. “
 
అని , బెడ్ దిగి అక్కడున్న పుస్తకాలు తీసుకుని వాటిని తన బ్యాగ్ లో పెట్టుకుని బ్యాగ్ తీసుకుని కిందకి వస్తాడు.. ఆ బ్యాగ్ లోనే రామ్ నిన్న ఆ బొమ్మని ఉంచింది.. అలా కిందకి వచ్చి వాళ్ళమ్మ ఇచ్చిన కారియర్ తీసుకుని బయటకు వెళ్తాడు.. అపుడే అక్కడకు వచ్చిన స్కూల్ బస్ ఎక్కగానే అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.. తరువాత రామ్ తన ఫ్రెండ్ ఛారీ దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు.. తను వచ్చిన కూడా ఛారీ పట్టించు కోకుండా పాలి పోయిన ముఖం తో దేని గురించి చాల తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు ఉన్నాడు.. అది చూసిన రామ్ ఛారీ తో, 
 
“ రేయ్ ఛారీ ఏమైంది రా, అలా ఉన్నావ్… “
 
అని అడగగానే , ఛారీ రామ్ వైపు తిరిగి….
 
“ మరేం లేదు రామ్.. మొన్న సైన్స్ టీచర్ ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు కదా.. నేను దానిని కంప్లీట్ చేయలేదు.. ఇపుడు స్కూల్ కి వెళితే ఖచ్చితంగా టీచర్ పనిష్ చేస్తుంది కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను రా… “
 
అని చాలా అమాయకంగా అంటాడు.. దానికి రామ్, ఛారీ ని చూస్తూ… స్నేహ భావం నిండిన కళ్ళతో..
 
“ నీ ప్రాజెక్టు లన్ని ఎపుడు చేసేది నేనే కదరా.. ఈ సారి కూడా నేనే చేశాను.. “
 
అని తన బ్యాగ్ ఓపెన్ చేసి బుక్ కోసం వెతుకుతాడు.. అపుడే రామ్ చెయ్యి ఆ బ్యాగ్ లో ఉన్న బొమ్మకి తగిలి అది బ్యాగ్ లో నుంచి కింద పడుతుంది.
 
  ఇక మరో పక్క, స్టోర్ రూమ్ తాళాలు పగలగొట్టాలని నిర్ణయించుకున్న చందు,. అక్కడ అతనికి కనిపించిన పెద్ద సుత్తి తీసుకుని, ఆ తాళాన్ని పగల గొడతాడు..ఆ చర్య వల్ల చందు శరీరం ఏదో తెలీని ఒత్తిడికి గురి అవుతుంది.. అయిన ధృఢంగా నిలబడి ఆ గదిలో ఏముందో చూడాలి అన్న తన ఆసక్తి మీదే దృష్టి సారించాడు.. ఆ వెంటనే తన రెండు చేతులతో ఆ గది తలుపులని బలంగా తోస్తాడు.. ఒక పెద్ద శబ్దం చేస్తూ ఆ గది తలుపులు తెరచు కున్నాయి.. 
 
ఎప్పుడైతే చందు ఆ గది తలుపులు తెరిచాడో, అప్పుడే ఆ గది నుంచి కొన్ని గబ్బిలాలు గుంపుగా వచ్చి చందు ముఖాన్ని తాకగానే, చందు తన చేతిని అడ్డు పెట్టుకుంటాడు.. అపుడే ఆ గబ్బిలాలు వాటి రెక్కల శబ్దాన్ని చేస్తూ అక్కడ నుంచి బయటకి ఎగిరి పోతాయి.. వాటి వైపే చూస్తూ నిశ్చలంగా చూస్తూ ఉన్న చందు.. 
 
“ ఇక్కడ ఇన్ని గబ్బిలాలు ఉన్నాయి ఏంటీ..”
 
అని అనుమానం తో నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తాడు.. ఆ గదిలోకి వెళ్ళి న చందు కి మొత్తం చీకటి గా ఉంటుంది. అపుడే అక్కడ స్విచ్ బోర్డ్ కోసం వెతికి, ఆ గదిలో లైట్స్ ఆన్ చేస్తాడు చందు.. వెంటనే లైట్స్ వెలగడం తో, ఆ గది మొత్తం ఎలా ఉందో చందూకి అర్థ మైంది.. ఆ గది మొత్తం దుమ్ము పట్టి, బూజు తో, చెత్త కుప్పలా పడి ఉన్న పాత సామానులతో చాలా దర్జీ గా ఉంది.. ఆ గది అణువణువు చాలా తీక్షణంగా చూస్తున్న చందూకి అక్కడ తనకి ఉపయోగ పడే ఎలాంటి వస్తువులు లేవని భావించి ఆ గది నుంచి బయటకు వెళ్ళాలి అని అనుకుంటాడు.. అపుడే అతని కళ్ళని కొన్ని పాత సామాన్ల మద్య ఉన్న ఒక పెయింటింగ్ ఆకర్షించింది.. 
 
ఇక మరో వైపు, కింద పడ బోతున్న బొమ్మని చటుక్కున పట్టుకుంటాడు రామ్.. అపుడే పక్కనే ఉన్న ఛారీ ఆ బొమ్మని చూస్తాడు. చూడగానే అతని కళ్ళు మెరిసాయి.. చాలా ఉత్సాహంగా, 
 
 “ రామ్.. ఈ బొమ్మ చాలా అందంగా ఉంది.. నీకు ఇది ఎక్కడిది.. “
 
అని అడుగుతాడు.. దానికి రామ్ , మురిసి పోతూ.. సమాధానం చెప్ప బోతుండగా, వారు వెళ్తున్న బస్ ఒక్క సారిగా కుదుపులకి గురి అయ్యి, డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడం వల్ల, ఆ బస్ లోని పిల్లలు , టీచర్స్ అంతా ఒక్క సారిగా ముందుకి పడతారు.. కుక్క అడ్డు రావడం తో డ్రైవర్ దాన్ని తప్పించడానికి సడెన్ బ్రేక్ వేయడం తో ఆ కుక్క సురక్షితం గా వెళ్లి పోతుంది.. దానితో అందరూ ఊపిరి పీల్చుకోగానే మళ్లీ బస్ ముందుకి మూవ్ అవుతుంది.. 
 
చందు ఆ పెయింటింగ్ దగ్గరకు వెళ్లి, అక్కడ ఉన్న వస్తువులు అన్నిటినీ తప్పించడంలో మునిగి పోయాడు.. వాటికి ఉన్న దుమ్ము ఆ గది మొత్తం నిండు కోవడం తో చందు దగ్గుతూ ఉన్నాడు. మొత్తానికి తను చూసిన పెయింటింగ్ ని చేతిలోకి తీసుకుని దాని మీద ఉన్న దుమ్ము ని కూడా దులుపుతాడు.. ఆ దుమ్ము మొత్తం ఆ పెయింటింగ్ నుంచి వేరై పోగానే , అప్పటి వరకు చాలా పురాతన పెయింటింగ్ ల ఉండే ఆ పెయింటింగ్ ఇపుడే వేసిన కొత్త దానిలా తళ తళ మెరిసి పోతుంది..
 
చందు ఆ పెయింటింగ్ ని పట్టుకున్న వెంటనే వాతావరణం ఒక్క సారిగా మారి పోతుంది.. చందు ఆ పెయింటింగ్ ని చేతిలోకి తీసుకుని వింతగా అందులో ఉన్న బొమ్మని చూస్తూ ఉంటాడు. ఆ పెయింటింగ్ లో ఉన్నది ఒక బొమ్మ.. ఎలాగైతే రామ్ పెయింటింగ్ లో చూశాడో అలాంటి బొమ్మే అది.. కాక పోతే అందులోని బొమ్మ రూపం వేరుగా ఉంది.. ఒక్క సారిగా చందు ఆ బొమ్మని తాకగానే , అక్కడ ఒక పెద్ద వెలుగు ఆ గది మొత్తాన్ని కప్పేస్తుంది.. 
 
     అలా వచ్చిన ఆ వెలుగు నుంచి ఒక కాంతి రేఖ అలా గాలిలో ప్రవేశించి రామ్ ప్రయాణిస్తున్న స్కూల్ బస్ లో రామ్ పట్టుకుని ఉన్న బొమ్మని తాకుతుంది.. ఎపుడైతే ఆ వెలుగు బొమ్మని తాకిందో.. ఆ బస్ లో కూడా ఒక పెద్ద వెలుగు సంభవించి , అది బస్ నడుపుతున్న డ్రైవర్ కంటిని తాకి బస్ అదుపు తప్పేలా చేస్తుంది.. దానితో ఆ బస్ బ్రిడ్జ్ పై వెళ్తుండగా డివైడర్ ని డీ కొట్టి కింద ఉన్న నదిలో పడి పోతుంది.. అలా పడగానే ఒక్క సారిగా బస్ లోని పిల్లలు అంతా ఆ నీటిలో మునిగి పోయారు.. రామ్ చేతిలో ఉన్న బొమ్మ రామ్ నుంచి విడి పోతుంది.. 
 
   
     అక్కడ చందు ఉన్న స్టోర్ రూమ్ లో వెలుగు మొత్తం వెనక్కి తగ్గిన తరువాత , తన చేతిలో పెయింటింగ్ కి బదులు ఒక బొమ్మ ఉండడం చూసి చందు ఆశ్చర్య పోతాడు.. 
 
  “ ఏంటీ ఇది చాలా. విచిత్రంగా ఉంది.. అసలు ఈ బొమ్మ ఏంటి.. “
 
అని అర్థం కానీ సిచ్యువేసన్ లో పడతాడు…
 
   చందుకి దొరికిన ఆ బొమ్మ ఎవరిది.. ? నీటిలో పడ్డ స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటీ..? వాళ్ళని ఎవరు రక్షించ బోతున్నారు.. ? అసలు ఆ పెయింటింగ్ ల వెనక ఉన్న రహస్యం ఏంటి.. ? ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే  విక్రమ ధీర నెక్స్ట్ చాప్టర్ చదివేయండి.


కామెంట్‌లు